PAN-Aadhaar Linking Deadline: పాన్- ఆధార్ లింక్ ఈ రోజే చివరి రోజు, ఈ లింక్ ద్వారా వెంటనే చేయండి, లేదంటే పాన్ కార్డు డిలీట్ అవుతుంది
పాన్-ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి చివరి గడువును చాలా సార్లు పొడిగించిన ఆదాయపు పన్ను శాఖ. ఈ సారి మాత్రం జూన్ 30 ను చివరి తేదీగా పేర్కొంది. ఈ ఒక్కరోజు మాత్రమే చివరి అవకాశం ఉంది. ఇంతకుముందు ఏప్రిల్ 31తోనే ఈ గడువు ముగిసింది
PAN-Aadhaar Linking Deadline Ends Today: పాన్-ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి చివరి గడువును చాలా సార్లు పొడిగించిన ఆదాయపు పన్ను శాఖ. ఈ సారి మాత్రం జూన్ 30 ను చివరి తేదీగా పేర్కొంది. ఈ ఒక్కరోజు మాత్రమే చివరి అవకాశం ఉంది. ఇంతకుముందు ఏప్రిల్ 31తోనే ఈ గడువు ముగిసింది. కానీ అదనంగా రూ. 1000 చెల్లించి జూన్ 30 వరకు పాన్-ఆధార్ లింక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చివరి తేదీ కాస్త ముగుస్తుంది.
నిర్ణిత సమయంలోపు పాన్-ఆధార్ లింక్ చేయకపోతే పాన్ నంబర్ పనిచేయదు. దీంతో పాన్ ఉపయోగించి ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేరు. అలాగే, పాన్ కార్డు పనిచేయకపోవడంతో ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పాన్-ఆధార్ లింక్ చేయని వారు ఆదాయపు పన్ను శాఖ వారి అధికారిక వెబ్‌సైట్ https://www.incometax.gov.in/iec/foportal/ వెళ్లి పాన్, ఆధార్ నెంబర్, మిగతా వివరాలను నమోదు చేసి లింక్ చేసుకోవచ్చు.
డెరెక్ట్ లింక్ ఇదిగో..https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar
కార్డు పనిచేయకపోతే అనేక సౌకర్యాలు వినియోగదారులకు నిలిపివేయబడతాయి. అలాగే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్-272B ప్రకారం రూ.10,000 వరకు జరిమానా విధించవచ్చు. ఇదే సమయంలో రూ.50 వేలకు మించి లావాదేవీలు చేయటం కుదరదు. బ్యాంకులో ఖాతాను నిర్వహించాలంటే మారిన కేవైసీ రూల్స్ కింద తప్పనిసరిగా పాన్ వివరాలు కస్టమర్లు అందించాల్సి ఉంది.
ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలన్నా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా పాన్ తప్పనిసరి. అలాగే టాక్స్ రిఫండ్స్ పొందాలన్నా పాన్ తప్పనిసరి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139AA ప్రకారం జూలై 1, 2017 వరకు PAN కార్డ్ జారీ చేయబడిన, ఆధార్ కార్డ్‌ని కలిగి ఉన్న ప్రతి పౌరుడు వాటిని లింక్ చేయడం తప్పనిసరి.
పంచాయతీ పనులకు డిజిటల్ చెల్లింపులు తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం
ఇదే సమయంలో అసోం, జమ్మూ & కాశ్మీర్, మేఘాలయ నివాసితులకు ఆధార్-పాన్ లింక్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే నాన్-రెసిడెంట్ ఇండియన్స్ కూడా ఆధార్-పాన్ కార్డ్ లింక్ చేయటం తప్పనిసరి కాదు. 80 ఏళ్లు పైబడిన వారు, గత సంవత్సరం వరకు భారత పౌరులు కాని వారికి కూడా ఇది పూర్తి చేయాల్సిన అవసరం లేదు.
ఆధార్-పాన్ లింక్ ప్రాసెస్
1) ఐటీ శాఖ అధికారిక వెబ్‌సైట్ https://www.incometax.gov.in/ లోకి లాగిన్ అవ్వండి, ఆదాయపు పన్ను శాఖ కొత్తగా ప్రారంభించిన ఇ-ఫైలింగ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది.
2) హోం పేజీలోనే ఎడమ వైపు "Link Aadhar" అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
3) ఇక్కడ ముందుగా పాన్ కార్డ్ నంబర్, తర్వాత మీ ఆధార్ నంబర్, ఆధార్ కార్డులో ఉన్న విధంగానే మీ పేరు, ఫోన్ నెంబర్ నమోదు చేయాలి.
3) మీరు ఇచ్చిన వివరాలన్ని సరిగ్గా ఉన్నాయో లేదో మరోసారి చూసుకోండి. పాన్ కార్డులోని పేరు, పుట్టిన తేదీ, లింగం మీ ఆధార్ వివరాలతో ధృవీకరించుకోవాల్సి ఉంటుంది.
4) ఒకవేళ మీ ఆధార్ కార్డుపై కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే కింద "I have only year of birth in Aadhaar card" ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి.మరొక ఆప్షన్ "I agree to validate my Aadhaar details" సెలెక్ట్ చేసుకొని 'Link Aadhar' పై క్లిక్ చేసి కొనసాగించండి.
5) ఇప్పుడు మీ ఫోన్ కు ఓటీపీ నెంబర్ వస్తుంది. దానిని ఎంటర్ చేసి ప్రక్రియ పూర్తి చేయవచ్చు.
ఒకవేళ మీరు ఆధార్ తో జత చేసిన మీ ఫోన్ నెంబర్ వేరుగా ఉన్నా లేదా ఇంకేవైనా వివరాలు తప్పుగా ఉంటే దగ్గర్లోని ఆధార్ కేంద్రానికి వెళ్లి పరిష్కరించుకోవాలి. ఆ తర్వాత ఈ ప్రక్రియను మరో సారి ప్రయత్నించండి.
ఆధార్ కు పాన్ లింక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే..
ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
వెబ్ సైట్ లో క్విక్ లింక్ సెక్షన్ లో ఉన్న ఆధార్ స్టేటస్ ఆప్షన్ ను ఎంచుకోండి.
వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
సర్వీస్ పై పాన్ ఆధార్ స్టేటస్ కనిపిస్తుంది.
మీ ఆధార్ ను పాన్ కు లింక్ చేసినట్టయితే లింక్ చేయబడిందని, ఒకవేళ చేయకపోతే చేయలేదని చూపిస్తుంది.
ఆధార్ పాన్ కార్డ్ లింక్ స్టేటస్ ను ఎస్ఎంఎస్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలంటే..
మీ ఫోన్ లో మెసేజింగ్ యాప్ ఓపెన్ చేయండి.
UIDPAN అని టైప్ చేసి <12 అంకెల ఆధార్ నంబర్ >10 అంకెల పాన్ నంబర్ ను టైప్ చేయండి.
పైన టైప్ చేసిన మెసేజ్ ను 56161 లేదా 567678కి సెండ్ చేయండి.
ఈ స్టెప్స్ తర్వాత మీ ఆధార్- పాన్ లింక్ స్టేటస్ కు సంబంధించిన అప్ డేట్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఎస్ఎంఎస్ వస్తుంది.
(The above story first appeared on LatestLY on Jun 30, 2023 11:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

