IPL Auction 2025 Live

Indian Railways: రైలు ప్రయాణికులకు అలర్ట్, ప్రతి రోజూ ఆరుగంటల పాటు రిజర్వేషన్ సేవలు నిలిపివేత, వచ్చే వారం రోజుల పాటు రాత్రి 11:30 గంటల నుంచి తెల్లారి ఉదయం 5:30 గంటల వరకు సేవలు ఆపేస్తున్నట్లు ప్రకటించిన భారతీయ రైల్వే

మెయింటెన్స్‌లో భాగంగా వారం రోజుల పాటు ప్రతీ రోజు ఆరు గంటల పాటు రిజర్వేషన్‌ సిస్టమ్‌ (Railways Passenger Reservation System) పని చేయదని పేర్కొంది. టికెట్‌ బుకింగ్‌తో పాటు పీఎన్‌ఆర్‌ ఎంక్వైరీ, టిక్కెట్‌ రద్దు తదితర సేవలు అన్నీ ఈ ఆరు గంటలు ( Shut for 6 Hours for Next 7 Days) నిలిచిపోనున్నాయి.

Representative Image (Photo Credits: Unsplash)

New Delhi, November 15: రైళ్లలో ప్రయాణం చేయాలనుకునే వారికి రైల్వేశాఖ ముఖ్య సూచన చేసింది. మెయింటెన్స్‌లో భాగంగా వారం రోజుల పాటు ప్రతీ రోజు ఆరు గంటల పాటు రిజర్వేషన్‌ సిస్టమ్‌ (Railways Passenger Reservation System) పని చేయదని పేర్కొంది. టికెట్‌ బుకింగ్‌తో పాటు పీఎన్‌ఆర్‌ ఎంక్వైరీ, టిక్కెట్‌ రద్దు తదితర సేవలు అన్నీ ఈ ఆరు గంటలు ( Shut for 6 Hours for Next 7 Days) నిలిచిపోనున్నాయి. కాగా 2020 మార్చిల లాక్‌డౌన్‌ విధించడంతో దేశవ్యాప్తంగా రైలు సర్వీసులు నిలిచిపోయాయి. సుమారు ఆర్నెళ్ల తర్వాత క్రమంగా ప్రత్యేక రైళ్ల పేరుతో కొన్ని రైళ్లను తిరిగి ప్రారంభించారు. [Poll ID="7784" title="సరిలేరు నీకెవ్వరు (or) అల వైకుంఠపురములో; ఈ రెండింటిలో మీకు ఏ సినిమా బాగా నచ్చింది?"]

ప్యాసింజర్‌ , లోకల్‌ రైళ్లను కూడా ప్రత్యేక రైళ్లుగానే నడుపుతూ వస్తున్నారు. దీంతో ఈ ప్రత్యేక రైళ్ల నంబర్లు మారాయి. అదే విధంగా హాల్టింగ్‌ స్టేషన్లలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. దాదాపు ఏడాది పాటు ఇదే విధానం కొనసాగింది. ఈ ప్రత్యేక నంబరు, స్టేషన్లు, ఛార్జీలకు తగ్గట్టుగానే రిజర్వేషన్‌ ప్రక్రియ నడిచింది.అయితే వీటికి పుల్ స్టాప్ పెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీనికి తోడు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా సాగుతుండటం కరోనా ముప్పు క్రమంగా సాధారణ స్థితికి వస్తుండటంతో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ఆపేయాలని నిర్ణయించింది.

తగ్గుముఖం పడుతున్న కరోనా, గత 24 గంటల్లో 10,229 కొత్త కోవిడ్ కేసులు, 125 మంది మహమ్మారి కారణంగా మృతి

ప్రస్తుతం ప్రత్యేకం పేరుతో తిరుగుతున్న రైళ్లను తిరిగి రెగ్యులర్‌ రైళ్లుగా మారుస్తామంటూ ఇటీవల రైల్వే మంత్రి ఆశ్వినీ వైభవ్‌ ప్రకటించారు. అందుగు తగ్గట్టుగా దేశవ్యాప్తంగా అన్ని రైళ్ల నంబర్లు, స్టేషన్ల హాల్టింగ్‌ , ఛార్జీల విషయంలో మార్పులు చేయాలి. దీనికి తగ్గట్టుగా టిక్కెట్‌ బుకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేసే పనిలో రైల్వేశాఖ ఉంది. టిక్కెట్‌ బుకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ పనులను నవంబరు 14 నుంచి 22వ తేదీల మధ్యన చేపట్టాలని నిర్ణయించారు.

Here's PIB India Tweet

ఎంపిక చేసిన తేదీల్లో ప్రతీ రోజు రాత్రి 11:30 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5:30 గంటల వరకు అంటే ఆరు గంటల పాటు రిజర్వేషన్‌ సేవలు దేశవ్యాప్తంగా నిలిపేస్తున్నారు. ఈ సమయంలో టిక్కెట్‌ బుక్‌ చేసుకోవడం, రద్దు చేయడం, పీఎన్‌ఆర్‌ స్టేటస్‌, కరెంట్‌ బుకింగ్‌ స్టేటస్‌, ట్రైన్‌ రియల్‌టైం తదితర సేవలు నిలిచిపోనున్నాయి. ప్రయాణికులకు ఏమైనా సమస్యలు ఉంటే 139 నంబరుకు ఫోన్‌ చేసుకునే వెసులుబాటు మాత్రం ఇచ్చారు.



సంబంధిత వార్తలు

Constitution Day of India: 75వ రాజ్యాంగ దినోత్సవం, ప్రాథమిక హక్కులు- భారత పౌరులకు అందించిన గొప్ప వరం, ప్రజాస్వామ్యానికి మూలస్తంభంలా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ

Special Trains To Sabarimala: అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త.. శబరిమలకు ఏపీ, తెలంగాణ నుంచి స్పెషల్ ట్రైన్స్.. డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 27వరకు అందుబాటులోకి

TG Weather Update: తెలంగాణపై చలి-పులి పంజా.. అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు రాత్రి ఉష్ణోగ్రతలు.. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (యూ)లో రికార్డు స్థాయిలో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. రానున్న మూడ్రోజుల్లో ఇంకా పడిపోనున్న ఉష్ణోగ్రతలు

Rains in AP: బంగాళాఖాతంలో వాయుగుండం.. నేటి నుంచి ఏపీలో భారీ వర్షాలు.. ఈ నెల 29 వరకు వానలే వానలు.. దక్షిణ కోస్తాలో ఈదురుగాలులు