మన దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 10,229 కొత్త కేసులు నమోదయ్యాయి. 125 మంది మహమ్మారి కారణంగా మృతి చెందారు. మరోవైపు సగానికి పైగా కేసులు కేరళలోనే నమోదయ్యాయి. కేరళలో నిన్న 5,848 కేసులు నమోదు కాగా... 46 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,34,096 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 523 రోజుల్లో ఇంత తక్కువ సంఖ్యలో యాక్టివ్ కేసులు ఉండటం ఇదే తొలిసారి. రికవరీ రేటు ప్రస్తుతం 98.26 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 11,926 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,38,49,785కి పెరిగింది. మరోవైపు 1,12,34,30,478 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఇప్పటి వరకు వేశారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Active cases account for less than 1% of total cases, currently at 0.39% - lowest since March 2020. Recovery Rate currently at 98.26% - highest since March 2020: Government of India #COVID19 pic.twitter.com/rOyBdSszC2
— ANI (@ANI) November 15, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)