Rains in Telugu States: బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేటి నుంచి మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వానలు.. పూర్తి వివరాలు ఇదిగో..
దీని ప్రభావంలోఆంద్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాలతో పాటు తెలంగాణలోని మరికొన్ని జిల్లాల్లో నేటి నుంచి 21వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Hyderabad, Aug 18: తూర్పు మధ్య బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన నేడు అల్పపీడనంగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంలోఆంద్రప్రదేశ్ (Andhrapradesh) లోని కోస్తా జిల్లాల్లోని (Coastal Districts) పలు ప్రాంతాలతో పాటు తెలంగాణలోని (Telangana) మరికొన్ని జిల్లాల్లో నేటి నుంచి 21వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తీరంలోని మత్స్యకారులు ఈ రోజు నుంచి ఈ నెల 21వ తేదీ వరకు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఏ జిల్లాల్లో వర్షాలంటే??
కోస్తాలోని జిల్లాలతో పాటు తెలంగాణలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి జిల్లాలలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే రెండు రోజులపాటు ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక రాజధాని హైదరాబాద్ నగరంలో వచ్చే రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.