Tirumala Devotees Rush: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్.. సెలవుల నేపథ్యంలో కొండపై ఇసుకేస్తే రాలనంత జనం.. ఆక్టోపస్‌ బిల్డింగ్‌ దాకా 3 కిలోమీటర్ల మేర క్యూలైన్‌.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

కొండపై భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు పోటెత్తారు.

Tirumala Temple (Credits: X)

Tirumala, May 19: తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్. కొండపై భక్తుల రద్దీ విపరీతంగా (Devotees Rush) పెరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ తో పాటు నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. ఆక్టోపస్‌ బిల్డింగ్‌ వరకు దాదాపు మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్‌ లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

మీ చేతి వేళ్ల గోళ్ల పైభాగంలో తెల్లని లేదా ఎర్రని చారలు కనిపిస్తున్నాయా? అయితే, అది క్యాన్సర్‌ కు సంకేతం కావొచ్చు.. అమెరికా పరిశోధకుల తాజా అధ్యయనం ఏం చెప్పిందంటే?

విశాఖపట్నంలో ఎన్‌ఏడీ జంక్షన్‌ లో మందుబాబు హల్ చల్.. మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసుపై దాడి చేసిన యువకుడు.. వీడియో వైరల్

భారీగా ఆదాయం

భక్తుల రద్దీ నేపథ్యంలో శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగింది. శనివారం నాడు శ్రీవారిని 90,721 మంది భక్తులు దర్శించుకోగా ఒక్కరోజే రూ.3.28 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.