SBI Alert: ఎస్‌బీఐ ఖాతాదారులకు ముఖ్య హెచ్చరిక, వారికి ఎట్టి పరిస్థితుల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకండి, పిన్ నంబర్ నమోదు చేయకండి, మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసిన బ్యాంక్
ఇతరుల నుంచి మనీ పొందడానికి కస్టమర్లు తమ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సిన అవసరమే లేదని (SBI alerts crores of customers) తేల్చి చెప్పింది. అదే టైంలో డబ్బు పొందడానికి పిన్ నంబర్ ఎంటర్ చేయనవసరం కూడా లేదని వివరించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు అలర్ట్ జారీ చేసింది. ఇతరుల నుంచి మనీ పొందడానికి కస్టమర్లు తమ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సిన అవసరమే లేదని (SBI alerts crores of customers) తేల్చి చెప్పింది. అదే టైంలో డబ్బు పొందడానికి పిన్ నంబర్ ఎంటర్ చేయనవసరం కూడా లేదని వివరించింది. ఒకవేళ మీరు నిర్లక్ష్యంగా పిన్ నంబర్ నమోదు చేసినా, కొందరి నుంచి పేమెంట్ కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా (do not scan QR code) మీకు మోసం జరిగనట్లేనని వెల్లడించింది. కస్టమర్లు తమ ఖాతాల నుంచి మాత్రమే నగదు విత్ డ్రా చేయాలని సూచించింది.
మోసం ఎలా జరుగుతుందంటే.. మోసగాళ్లు మీ నంబర్‌కు ఫోన్ చేసి మీరు బహుమతి గెలుచుకున్నారని, మీకు ఒక క్యూఆర్ కోడ్ పంపుతాను.. మీరు దాన్ని స్కాన్ చేసి ధృవీకరించుకోవడానికి పిన్ నంబర్ ఎంటర్ చేయాలని చెబుతారు. ఆ క్యూఆర్ కోడ్‌ను మోసగాళ్లు టాంపర్ చేసి మరో క్యూఆర్ కోడ్ రీప్లేస్ చేస్తారు. మీ పేరు మీదే ఇదంతా చేస్తారు. ఒకవేళ మీరు అప్రమత్తంగా లేకుండా నగదు చెల్లింపులు చేసినట్లయితే, అది కొందరు మోసగాళ్లకు (you will be robbed) చేసినట్లే. మోసగాళ్ల ఎత్తులు జిత్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్బీఐ సూచిస్తున్నది.
దేశంలో గత 24 గంటల్లో 13,405 మందికి కరోనా, మహమ్మారి వల్ల నిన్న 235 మంది మృతి
కాబట్టి ఎవరేం చెప్పినా వారి నుంచి నగదు పొందడానికి మీ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఇతరులు డబ్బు చెల్లిస్తామంటే పిన్ నంబర్ లేదా పాస్‌వర్డ్ ఎంటర్ చేయొద్దు. యూపీఐ పిన్ నంబర్ కేవలం మనం నగదు చెల్లింపులు చేయడానికి మాత్రమే వాడాలి. ఇతరుల నుంచి నగదు మనం నగదు స్వీకరించడానికి కాదని తెలుసుకోవాలి. మనీ చెల్లింపులు జరిపిన ప్రతిసారీ మొబైల్ నంబర్, పేరు చెక్ చేసుకోవాలి. అలాగే ఇతరులకు పిన్ నంబర్ గానీ, పాస్‌వర్డ్ గానీ షేర్ చేయొద్దు. ఏదైనా సమస్య తలెత్తితే సంబంధిత అధికారుల నుంచి సాయం తీసుకోవాలి. చెల్లింపుల్లో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే, సంబంధిత సెక్షన్ సాయం తీసుకోవాలని ఎస్‌బీఐ తెలిపింది.