SBI Hikes FD Interest Rates: ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ భారీగా పెంపు, తక్షణమే అమల్లోకి కొత్త వడ్డీ రేట్లు, వివరాలివే!
ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD)పై చెల్లించే వడ్డీ (Interest) రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. SBI వెబ్‌సైట్ ప్రకారం.. రూ.2 కోట్ల కన్నా ఎక్కువ బల్క్ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను (Interest Rates) 20 నుంచి 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు SBI తెలిపింది.
New Delhi, March 11: ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫిక్స్ డ్ డిపాజిట్ అకౌంటుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD)పై చెల్లించే వడ్డీ (Interest) రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. SBI వెబ్‌సైట్ ప్రకారం.. రూ.2 కోట్ల కన్నా ఎక్కువ బల్క్ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను (Interest Rates) 20 నుంచి 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు SBI తెలిపింది. SBI పెంచిన ఈ కొత్త వడ్డీ రేట్లు మార్చి 10 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. SBI వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. రూ.2 కోట్లకు కన్నా ఎక్కువ పెట్టుబడి ఉండాలి. అలాగే 211 రోజుల నుంచి ఏడాది కంటే తక్కువ వ్యవధితో FDలపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్లను (Basis Points) పెంచింది. కొత్త వడ్డీ రేట్లతో మార్చి 10 నుంచి FDలపై 3.30 శాతం వడ్డీ క్రెడిట్ కానుంది.
సీనియర్ సిటిజన్లకు (Senior Citizens) FDలపై వడ్డీ రేటు 3.60 శాతం నుంచి 3.80 శాతానికి పెరిగింది. ఈ ఏడాది నుంచి పదేళ్ల టెన్యూర్ కలిగిన బల్క్ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను SBI 50 బేసిస్ పాయింట్లు పెంచింది. వడ్డీ రేట్లు 3.10 శాతం నుంచి 3.60 శాతానికి చేరుకోనుంది. ఈ FDలపై సీనియర్ సిటిజన్లు 4.10 శాతం వరకు వడ్డీని పొందవచ్చని SBI పేర్కొంది.
పెరిగిన ఈ కొత్త వడ్డీ రేట్లు (Interest Rates) కొత్త డిపాజిట్లకు, రెన్యూవల్ డిపాజిట్లకు కూడా వర్తించనున్నాయి. కోట్లలోపు FD వడ్డీ రేట్లపై SBI వెబ్‌సైట్ ప్రకారం.. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కన్నా తక్కువ FD కాలానికి వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 5.20 శాతానికి చేరుకుంది. అలాగే 3 సంవత్సరాల నుంచి ఐదేళ్లలోపు 15 బేసిస్ పాయింట్లు పెరిగి 5.45 శాతానికి చేరుకుంది. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల వరకు FD కాలానికి ఫిబ్రవరి 15, 2022 నుంచి అమలులోకి వచ్చేలా వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 5.50 శాతానికి చేరింది.
బల్క్ టర్మ్ డిపాజిట్ల ముందస్తు చెల్లింపులపై ముందస్తు జరిమానాలు 1శాతంగా ఉంటాయి. టర్మ్ డిపాజిట్ ముందస్తు ఉపసంహరణకు జరిమానా తగ్గదు. లేదంటే మాఫీ చేయడం కుదరదు. సీనియర్ సిటిజన్ FD వడ్డీ రేట్లు అన్ని కాల వ్యవధిలో, సీనియర్ సిటిజన్‌లు సాధారణ రేటు కంటే అదనంగా 0.50 శాతం రేటును అందుకోవచ్చు.