Cinnamon Benefits: షుగర్ పేషెంట్లకు దివ్యౌషదం దాల్చిన చెక్క, దాంతో రోజూ ఇలా చేస్తే ఇన్సులిన్ అవసరం కూడా లేదు! బీపీ, అజీర్ణానికి కూడా చెక్ పెట్టే దాల్చిన చెక్క
ప్రతి ఇంట్లో ఉండే మసాలా దినుసు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ(East India company) వ్యాపారంలో అత్యధిక రాబడిని రాబట్టిన స్పైస్‌గా చరిత్రకెక్కింది. భారత్‌లో వంటకాలతో పాటు ఆయుర్వేద మందుల తయారీలోనూ దాల్చిన చెక్కను (cinnamon) విరివిగా ఉపయోగిస్తారు.
Hyderabad Feb 04: ఒకప్పుడు బంగారం కంటే అధిక ధర పలికిన దాల్చినచెక్కను(cinnamon) అప్పట్లో కరెన్సీగా కూడా వాడేవారు. ప్రతి ఇంట్లో ఉండే మసాలా దినుసు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ(East India company) వ్యాపారంలో అత్యధిక రాబడిని రాబట్టిన స్పైస్‌గా చరిత్రకెక్కింది. భారత్‌లో వంటకాలతో పాటు ఆయుర్వేద మందుల తయారీలోనూ దాల్చిన చెక్కను (cinnamon) విరివిగా ఉపయోగిస్తారు. కాఫీ, టీల్లోనూ వాడే దాల్చిన చెక్క ఘాటైన వాసనతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
లవంగాలు(cloves) వంటి ఇతర మసాలా దినుసులతో పాటు దాల్చిన చెక్కతో మెరుగైన జ్ఞాపక శక్తి (sharpen memory), ఒత్తడి మటుమాయం(reduce stress) కావడంతో పాటు నిద్రలేమి సమస్యను (improve sleep) నివారించడం ఇతర ప్రయోజనాలు చేకూరుస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. దాల్చిన చెక్కను నిత్యం వాడటంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఇది యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్(anti-bacterial), యాంటీ ఫంగల్ (Anti-viral,) ఔషధంగా అద్భుతంగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.
దాల్చిన చెక్కతో మధుమేహం నియంత్రణలో ఉండటంతో పాటు ప్రేవుల ఆరోగ్యం మెరుగవుతుంది. దాల్చిన చెక్క జీర్ణ వ్యవస్ధలో వాపు ప్రక్రియను నిరోధిస్తుందని పరిశోధనల్లో తేలింది. రక్తపోటును కూడా దాల్చిన చెక్క తగ్గిస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. దాల్చిన చెక్కతో మెదడు ఆరోగ్యం మెరుగవుతుందని న్యూట్రిషనల్ న్యూరోసైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం తెలిపింది.