Telugu States Weather Update: వాయుగుండంగా బలపడిన అల్పపీడనం, 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

రాగల 24 గంటల్లో ఒడిశాలో తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని హైదరాబాద్‌లోని వాతారణ కేంద్రం తెలిపింది

Cyclone (Photo-ANI)

Hyd, July 19: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది.ప్రస్తుతం ఒడిశాలోని పూరీకి ఆగ్నేయంగా 70 కిలో మీటర్లు, ఏపీలోని కళింగపట్నం తూర్పు-ఈశాన్యంగా 240 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. రాగల 24 గంటల్లో ఒడిశాలో తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని హైదరాబాద్‌లోని వాతారణ కేంద్రం తెలిపింది.

రేపు ఉదయం వాయవ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ-వాయవ్య దిశగా కదిలి 24 గంటల్లో క్రమంగా బలహీనపడుతోందని తెలిపింది. ఈ క్రమంలో రాగల రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో (Telugu States Weather Update) భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణపై దీని ప్రభావం నేడు, రేపు ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది.ఈ తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణలో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు శుక్రవారం రోజు అయిదు జిల్లాలు(కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం) జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలతోపాటు అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.  కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్, భారీ వరదలకు ఉత్తరాంధ్ర విలవిల, స్కూళ్లకు సెలవులు, ఏజెన్సీ గ్రామాలతో తెగిపోయిన సంబంధాలు

ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, కామారెడ్డి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, సంగారెడ్డి, కామారెడ్డి, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం ఆదిలాబాద్, కుమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు కూడా ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది.  వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, తెలంగాణలో వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు, ఖమ్మం జిల్లాలో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు

రెడ్ అలెర్ట్ ప్రకటించిన జిల్లాల్లో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్న కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అదే విధంగా ఆదిలాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ (భారీ వర్షాలు)జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్‌ నగరంలో నేటి సాయంత్రం(శుక్రవారం)మోస్తారు నుంచి తేలికపాటి వర్షం కురిసే అకవాశం ఉందని పేర్కొంది.

వాయుగుండం ప్రభావంతో ఏపీలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయని పేర్కొంది. ఈ మేరకు కొస్తా జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణ, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు..కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. తీరం వెంబడి అత్యధికంగా గంటకు 65 కిమీ వేగంతో గాలులు స్తుండటంతో వేటకు వెళ్ళారాదని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది.

ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రమాదస్థాయిలో ఏలూరు జిల్లా వేలేరుపాడు జలాశయం ప్రవహిస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.

ఇక హైదరాబాదులో సాయంత్రం మోస్తారు నుంచి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.



సంబంధిత వార్తలు

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు