Karnataka Hijab Row: కర్ణాటకలో తెరుచుకున్న పాఠశాలలు, విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధంపై విద్యార్థులు నిరసన, సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్షన్‌ 144 జారీ చేసిన పోలీస్ అధికారులు

ముందు జాగ్రత్తగా బెంగళూరు, మైసూరు, ఉడుపితో పాటు పలు జిల్లాల్లో భద్రతను పెంచాలని నిర్ణయించింది.

Karnataka Hijab Row (photo-PTI)

Bengaluru, Feb 14: పది రోజులుగా హిజబ్, కేసరి వివాదంతో పలు జిల్లాల్లో బుధవారం నుంచి మూతపడిన పాఠశాలలు సోమవారం ప్రారంభమతుండగా, గొడవలు తలెత్తకుండా ప్రభుత్వం భారీ బందోబస్తును కల్పిస్తోంది. ముందు జాగ్రత్తగా బెంగళూరు, మైసూరు, ఉడుపితో పాటు పలు జిల్లాల్లో భద్రతను పెంచాలని నిర్ణయించింది. సీఎం బొమ్మై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, విద్యాశాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు.

తొలి విడతలో 1 నుంచి 10వ తరగతి వరకు స్కూళ్లు మొదలవుతాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్షన్‌ 144 జారీ చేశారు. 12 నుంచి 19వ తేదీ వరకు నిషేధాజ్ఞలు అమలవుతాయి. బడుల వద్ద గుంపులుగా ఉండరాదని, ధర్నాలు చేయరాదని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఏం జరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది. హిజబ్‌లు, కేసరి కండువాలను వేసుకొస్తే అధికారులు ఎలా వ్యవహరిస్తారో. కాగా, పాఠశాలల పరిస్థితిని గమనించిన తరువాత కాలేజీల ఆరంభంపై నిర్ణయానికి వస్తామని సీఎం చెప్పారు.

కర్ణాటక హిజాబ్​ వ్యవహారంపై మలాలా ట్వీట్, ఆడపిల్లలను హిజాబ్‌లు ధరించి పాఠశాలకు వెళ్లనివ్వకపోవడం దారుణం, మహిళలను చిన్నచూపును ఆపాలంటూ ఆవేదన

కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధంపై (Karnataka Hijab Row) విద్యార్థులు నిరసన తెలిపారు. మహారాష్ట్రలోని థానే నగరంలో ఓ మహిళ హిజాబ్ కు మద్ధతుగా ముస్లిం విద్యార్థినులకు అండగా ప్లకార్డు పట్టుకొని నిరసన (Udupi school students slam protesting) వ్యక్తం చేసింది. కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ నిషేధానికి వ్యతిరేకంగా తమిళనాడులో ఇస్లామిక్ సంస్థలు నిరసనలు తెలిపాయి. సోమవారం కోయంబత్తూరులో ముస్లిం జమాత్ మహిళలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి నిరసన తెలిపారు.

శబరిమలలో ముస్లిం బాలికలను హిజాబ్ ధరించకుండా ఆపడాన్ని ఉమెన్ లిబరేషన్ పార్టీ నాయకురాలు వ్యతిరేకించారు. ఉడుపిలోని పాఠశాలల్లో పరీక్షలు సమీపిస్తున్నందున ఆన్ లైన్ తరగతులు ప్రారంభించాలని విద్యార్థులు కోరారు. కాగా హిజాబ్ వివాదంపై రెచ్చగొడితే వారిపై చర్యలు తీసుకుంటామని కర్ణాటక రాష్ట్ర హోంశాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర చెప్పారు.మంగళూరు నగరంలోని పాఠశాలలకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ నిషేధాజ్ఞలు విధించారు.కర్ణాటక రాష్ట్రంలో సోమవారం నుంచి పాఠశాలలు పునర్ ప్రారంభించడంతో అక్కడ ఎలాంటి ఆందోళనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.