Lok Sabha Elections 2024: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రారంభమైన లోక్ సభ తొలి దశ ఎన్నికల పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకోబోతున్న 16 కోట్ల మంది.. దేశవ్యాప్తంగా 102 నియోజకవర్గాల్లో మొదలైన ఓటింగ్
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో లోక్ సభ ఎన్నికల మహా సంగ్రామంలో కీలక ఘట్టం ఆవిష్కృతం అయ్యింది.
Newdelhi, Apr 19: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ (India) లో లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections 2024) మహా సంగ్రామంలో కీలక ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. లోక్‌సభ ఎన్నికలు-2024 తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన 1.87 లక్షల పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలైంది. 18 లక్షల మంది భద్రతా సిబ్బంది విధుల్లో ఉన్నారు.
తొలి దశలో 8 మంది కేంద్ర మంత్రులు
నేడు జరుగుతున్న ఈ ఓటింగ్‌లో మొత్తం 16 కోట్ల మంది ఓటర్లు 1,625 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. తొలి దశలో 8 మంది కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఒక మాజీ గవర్నర్‌తో సహా పలువురు ప్రముఖ రాజకీయ నేతలు ఉన్నారు.