Cm Revanth Reddy

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) దక్షిణాది రాష్ట్రాల్లో 12-15 పార్లమెంటు స్థానాలను గెలుచుకోవడం కష్టమని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం అన్నారు. కేరళలోని అట్టింగల్‌లో కాంగ్రెస్‌ నాయకుడు అదూర్‌ ప్రకాష్‌ తరఫున ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా జరిగిన ర్యాలీలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, కేరళలోని 20 లోక్‌సభ స్థానాల్లో గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ విజయం సాధిస్తుందని, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో కనీసం 14 స్థానాలు కైవసం చేసుకుంటుందని అన్నారు.

బీజేపీ 400 సీట్లు దాటుతుందని విశ్వాసం వ్యక్తం చేయడంపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కూడా గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తాను 100 సీట్లు గెలుస్తానని చెప్పారని, అయితే కేవలం 39 సీట్లు మాత్రమే గెలిచి బొక్క బోర్లాపడిందన్నారు.అదే విధంగా ప్రజలను మభ్యపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, అయితే ప్రజలు తెలివైన వారని, ఆ పార్టీకి గుణపాఠం చెబుతారని రేవంత్ రెడ్డి అన్నారు.  సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడు, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, లోక్ సభ ఎన్నికలే టార్గెట్‌గా నయా స్కెచ్

కాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కంటే ఎక్కువ కాలం ఉండదని కేసీఆర్ ఇటీవల అన్నారు. 'బీజేపీలో ఎవరు ఎప్పుడు చేరతారో ఎవరికీ తెలియదు'. “మాకు తెలియదు, ముఖ్యమంత్రి (రేవంత్ రెడ్డి) స్వయంగా బిజెపికి జంప్ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేయాలని తాము కోరుతున్నామని, ఇటీవలి పరిణామాలను పరిశీలిస్తే, అది ఏడాది కంటే ఎక్కువ ఉంటుందా అనే సందేహం ఉందని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు రెండు లోక్‌సభ స్థానాలకు మించి రావని అన్ని సర్వేలు కూడా తేల్చాయని చెప్పారు.