Uttar Pradesh Horror: యూపీలో దారుణం, కొడుకు ఆరోగ్యం కోసం ఏడేళ్ల బాలుడు నరబలి, మంత్రగాడి మాటలు నమ్మి చిన్నారిని దారుణంగా గొంతు చేసి హత్య చేసిన కసాయి
మూఢనమ్మకాల మోజులో పడి కొడుకు అరోగ్యం బాగవుతుందని నమ్మి మరో బాలుడిని తండ్రి బలిచ్చాడు. యూపీలోని బహ్రైచ్ (Bahraich) జిల్లా పర్సా గ్రామానికి (Parsa village) చెందిన కృష్ణవర్మ (Krishna Verma) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు.
Lucknow, Mar 27: యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూఢనమ్మకాల మోజులో పడి కొడుకు అరోగ్యం బాగవుతుందని నమ్మి మరో బాలుడిని తండ్రి బలిచ్చాడు. యూపీలోని బహ్రైచ్ (Bahraich) జిల్లా పర్సా గ్రామానికి (Parsa village) చెందిన కృష్ణవర్మ (Krishna Verma) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. అతనికి వివేక్ వర్మ (Vivek Verma) అనే 10 ఏండ్ల వయస్సున్న కుమారుడు ఉన్నాడు.
కృష్ణవర్మకు అదే గ్రామంలో అనూప్ (Anoop) అనే ఓ బంధువు ఉన్నాడు. అనూప్‌కు రెండున్నరేండ్ల వయస్సున్న కుమారుడు ఉన్నాడు. ఆ బాలుడు గత కొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్యం చేయించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో అనూప్ మూఢనమ్మకాలను నమ్మి ఓ తాంత్రికుడిని (Occultist) కలిసాడు.
నరబలి చేస్తే మీ కొడుకు ఆరోగ్యం బాగుపడుతుందని ఆ తాంత్రికుడు అతనికి చెప్పాడు. మంత్రగాడిన నమ్మిన అనూప్.. తప మేనమామ చింతారామ్‌తో కలిసి గురువారం రాత్రి బంధువు కొడుకు వివేక్ వర్మను ఎత్తుకెళ్లాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గొంతుకోసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకున్నారు. అయితే వివేక్ కనిపించకుండా పోవడంతో అతని తండ్రి కృష్ణవర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
స్కూల్ ప్రిన్సిపాల్ గదిలో కండోమ్స్, మందు బాటిళ్లు, మిషనరీ పాఠశాలను సీల్ చేసిన ఎంపీ ప్రభుత్వం
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. బాలుడికోసం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇంటికి సమీపంలోని పొలాల్లో వివేక్‌వర్మ మృతదేహం లభించింది. హత్యకేసు కింద నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తాంత్రికుడి మాటలు నమ్మిన అనూప్.. వివేక్‌వర్మను నరబలి ఇచ్చినట్టు అసలు విషయం బయటపడింది. దీంతో మంత్రగాడితోపాటు అనూప్‌ను, అతనికి సహకరించిన చింతారామ్‌ను అరెస్టు చేశామని బరైచ్ ఎస్పీ ప్రశాంత్ వర్మ వెల్లడించారు.