Hyderabad: గణేష్ మండపాల్లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వారికి జైలు శిక్ష, ఏకంగా 200 మందిని జైల్లో వేసిన షీ టీమ్స్
ఇటీవల గణేష్ నిమజ్జనం(Ganesh festival) సందర్భంగా ఖైరతాబాద్‌లోని బడా గణేష్, ఇతర రద్దీగా ఉండే గణేష్ మండపాలు, నిమజ్జనం సమయంలో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న 996 మందిని షీ టీమ్స్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
Hyderabad, OCT 04: నగరంలో మహిళలతో అసభ్యకరంగా(Misbehaving) ప్రవర్తించే వారికి చోటు లేదని, బాధితులు ధైర్యంగా షీ టీమ్స్‌కు(She teams) ఫిర్యాదు చేయాలని సిటీ మహళా భద్రత డీసీపీ దార కవిత సూచించారు. ఇటీవల గణేష్ నిమజ్జనం(Ganesh festival) సందర్భంగా ఖైరతాబాద్‌లోని బడా గణేష్, ఇతర రద్దీగా ఉండే గణేష్ మండపాలు, నిమజ్జనం సమయంలో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న 996 మందిని షీ టీమ్స్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
Jangaon: మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్, ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, నిందితులపై పోక్సో కేసు నమోదు
అందులో 200 మందికి మూడు రోజుల పాటు జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.1050 జరిమానాను విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిందని ఒక ప్రకటనలో వివరించారు. మిగతా వారికి వారి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. రద్దీ ప్రాంతాలలో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఎవరు చూడరనే భావనలో ఉండేవారు తమ మైండ్‌సెట్‌ను మార్చుకోవాలని, షీ టీమ్స్ నిఘా నిరంతరం కొనసాగుతుందని డీసీపీ హెచ్చరించారు.