Hottest Year 2024: అత్యంత వేడి సంవత్సరంగా 2024 రికార్డ్.. నవంబర్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు.. యూరోపియన్ వాతావరణ సంస్థ కోపర్నికస్ వెల్లడి
సగటున 1.5 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో ఈ రికార్డు నమోదు చేసింది. ఈ మేరకు యూరోపియన్ వాతావరణ సంస్థ కోపర్నికస్ తెలిపింది.
Newdelhi, Dec 10: అత్యంత వేడి సంవత్సరంగా 2024 రికార్డుల్లో (Hottest Year 2024) నిలిచింది. సగటున 1.5 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో ఈ రికార్డు నమోదు చేసింది. ఈ మేరకు యూరోపియన్ వాతావరణ సంస్థ కోపర్నికస్ తెలిపింది. ఈ ఏడాది నవంబర్ లో సగటున 14.10 డిగ్రీల సెల్సియస్ తో అత్యంత వేడి నెలగా నిలిచిందని వెల్లడించింది. పారిశ్రామిక విప్లవం కాలం నాటి ముందు స్థాయిల కంటే ఈ ఏడాది నవంబర్‌లో 1.62 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా నమోదైందని చెప్పింది.
భారత వాతావరణ విభాగం ఇలా..
భారత వాతావరణ విభాగం ప్రకారం నవంబర్ నెల ఉష్ణోగ్రత రికార్డులు పరిశీలిస్తే 1901 తర్వాత ఈ ఏడాది నవంబర్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 0.62 డిగ్రీలు అధికంగా సగటున గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29.37 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డయ్యాయి.