Floods in North East: ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తుతున్న వరదలు, మూడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, 54మంది మృతి, నిరాశ్రయులైన లక్షలాదిమంది
గత రెండు రోజుల నుంచి వరదల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రెండు రాష్ట్రాల్లో సుమారు 42 మంది మరణించారు. అస్సాంలోని 28 జిల్లాల్లో దాదాపు 19 లక్షల మంది ప్రభావానికి గురయ్యారు. లక్ష మంది రిలీఫ్ క్యాంపులో ఉన్నట్లు అధికారులు చెప్పారు.
Agarthala, June 18: అస్సాం (Assam), మేఘాలయాలో (Meghalaya) భారీ వర్షాల వల్ల వరదలు బీభత్సం సృష్టించాయి. గత రెండు రోజుల నుంచి వరదల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రెండు రాష్ట్రాల్లో సుమారు 54 మంది మరణించారు. అస్సాంలోని 28 జిల్లాల్లో దాదాపు 19 లక్షల మంది ప్రభావానికి గురయ్యారు. లక్ష మంది రిలీఫ్ క్యాంపులో ఉన్నట్లు అధికారులు చెప్పారు. అస్సాంలో 12 మృతిచెందగా, మేఘాలయాలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. త్రిపుర రాజధాని అగర్తలాలో (Agarthala) భారీ స్థాయిలో వరదలు వచ్చాయి. ఆ నగరంలో సుమారు 6 గంటల్లోనే 145 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. దీంతో త్రిపుర ఉప ఎన్నిక ప్రచారంపై తీవ్ర ప్రభావం పడింది. కుండపోత వర్షంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. బయటకు వచ్చేందుకు వణుతున్నారు. తాగునీరు లేక ఇబ్బందుల పడుతున్నారు.
మేఘాలయాలోని చిరంపుంజిలో రికార్డు స్థాయిలో వర్షం పడింది. అగర్తలాలో 60 ఏళ్ల తర్వాత మూడవ అత్యధిక వర్షం పాతం నమోదైంది. ఆకస్మిక వరదల వల్ల స్కూళ్లను మూసివేశారు.
వరదల్లో చనిపోయిన బాధిత కుటుంబాలకు మేఘాలయా సీఎం 4 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. అస్సాం వరదల్లో (Assam Floods) మూడు వేల గ్రామాలు మునిగాయి. 43 వేల హెక్టార్ల పంట నీట మునిగింది. కల్వర్టులు, రోడ్లు ధ్వంసం అయ్యాయి.