Bihar Jivitputrika Festival Tragedy: బీహార్ జీవితపుత్రికా పండుగలో విషాదం, నీట మునిగి 46 మంది మృతి ఇందులో 36 మంది పిల్లలే
జీవితపుత్రిక పర్వదినం సందర్బంగా వేర్వేరు చోట్ల జరిగిన సంఘటనల్లో 46 మంది మృతి చెందారు. ఇందులో 36 మంది చిన్నారులే ఉండటం స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
Hyd, Sep 26: బీహార్‌లో విషాదం నెలకొంది. జీవితపుత్రిక పర్వదినం సందర్బంగా వేర్వేరు చోట్ల జరిగిన సంఘటనల్లో 46 మంది మృతి చెందారు. ఇందులో 36 మంది చిన్నారులే ఉండటం స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
జీవితపుత్రిక పర్వదినం వేళ విషాదం నెలకొనడంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల ఎక్స్-గ్రేషియా ప్రకటించారు. తూర్పు మరియు పశ్చిమ చంపారన్, ఔరంగాబాద్, కైమూర్, బక్సర్, సివాన్, రోహ్తాస్, సరన్, పాట్నా, వైశాలి, ముజఫర్పూర్, సమస్తిపూర్, గోపాల్గంజ్ ,అర్వాల్ జిల్లాల్లో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. రైల్వే ప్రయాణికుడికి గుండెపోటు.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన టీసీ..వీడియో ఇదిగో
ఇప్పటి వరకు 43 మృతదేహాలను వెలికి తీశారు. ఎన్డీఆర్ఎఫ్ , (ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్య్కూ ఆపరేషన్ చేస్తున్నారు. జీవిత పుత్రిక పండుగ సందర్భంగా పుణ్యస్నాం చేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వివిధ చెరువులకు వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు.