Online Fraud: రూ.10 వేల కోసం ఆశపడి, రూ. 9 కోట్లను పోగొట్టుకున్న 85 ఏళ్ల వృద్ధుడు, గుజరాత్‌లో వెలుగు చూసిన ఆన్‌లైన్ మోసం
9 కోట్లు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక దినేశ్ పటేల్ వివిధ కార్పోరేట్ టెక్స్ టైల్ కంపెనీలో చాలా ఏళ్లుగా పనిచేసి ప్రస్తుతం రిటైర్ అయ్యార....
Ahmedabad, February 19: రాజుల సొమ్ము రాళ్ల పాలు అనే సామెత ఊరికే రాలేదేమో. ఓ వృద్ధుడు తన జీవితకాలంలో సంపాదించిన మొత్తాన్ని, దాచుకున్న సేవింగ్స్ ను అన్నింటినీ ఆసాంతం ఒకేసారి కడించుకున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు అక్షరాల రూ. 9 కోట్లు పోగొట్టుకున్నాడు. అన్ని అయిపోయాక తీరిగ్గా వచ్చి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. గుజరాత్‌లో (Gujarat) చోటుచేసుకున్న ఈ ఘటన నివ్వెర పరుస్తుంది.
వివరాల్లోకి వెళ్తే, గుజరాత్ రాష్ట్రం అహ్మాదాబాద్ నగరంలో పంచవతి ప్రాంత నివాసి అయిన దినేశ్ పటేల్ (Dinesh Patel) అనబడే ఓ 85 ఏళ్ల వృద్ధుడు తనను 33 మంది అపరిచిత వ్యక్తులు ఆన్ లైన్ ద్వారా మోసం (Online Fraud) చేశారని, తన సొమ్మునంతా కాజేశారని సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
"రెండేళ్ల క్రితం 2017, అక్టోబర్ 18వ తేదీన రూ,10 వేలకే విదేశీ ప్రయాణం అని టూర్ విశేషాలను ఆఫర్ చేస్తూ ఒక మెయిల్ వచ్చింది. అది ప్రముఖ కంపెనీ పేరుతో వచ్చినందున అది నిజమని నమ్మి, నేను ఆ యాత్రపై ఆసక్తికనబరిచాను. అలా తొలిసారి నా వద్ద నుంచి రూ. 10 ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. ఆ తర్వాత నుంచి అదే పనిగా చాలా మంది నన్ను సంప్రదిస్తూ అంతకంటే మంచి ఆఫర్ ఉందని, బహుమతులు కూడా లభిస్తాయని, మరెన్నో లేనిపోని ఆశలు కల్పిస్తూ తన నుంచి రూ. 10 నుంచి రూ. 50 లక్షల వరకు అనేక సందర్భాల్లో తన నుంచి ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. అయితే ఇంతవరకూ ఎవరూ కూడా తనను యాత్రకు తీసుకుపోలేదు, నా డబ్బు తిరిగి ఇవ్వలేదు" తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆన్‌లైన్ మోసాలపై ఫిర్యాదు చేసేందుకు వెబ్ పోర్టల్ ప్రారంభించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ
ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడి నుంచి 2017- 2019 వరకు రెండేళ్ల కాలంలో సుమారు 80 ఆన్ లైన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ల ద్వారా నిందితులు రూ. 9 కోట్లు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక దినేశ్ పటేల్ వివిధ కార్పోరేట్ టెక్స్ టైల్ కంపెనీలో చాలా ఏళ్లుగా పనిచేసి ప్రస్తుతం రిటైర్ అయ్యారు