Woman Kidnaped Her Lover: మాజీ లవర్‌ను కిడ్నాప్ చేసి బలవంతంగా తాళికట్టించుకున్న యువతి, చెన్నైలో సీరియల్‌ను తలపించే ట్విస్టులతో స్టోరీ
దాదాపు ఏడేళ్లపాటు వారి ప్రేమాయణం కొనసాగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. చిన్నచిన్న గొడవలు జరిగి ఇద్దరూ ఒకరికొకరు దూరమయ్యారు. ఆ తర్వాత ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ప్రియురాలు తన ప్రియుడిని కిడ్నాప్ (Kidnaped) చేసి బలవంతంగా తాళి కట్టించుకుంది.
Chennai, AUG 13: ఓ యువతి, యువకుడు చాలా కాలంపాటు ప్రేమించుకున్నారు. దాదాపు ఏడేళ్లపాటు వారి ప్రేమాయణం కొనసాగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. చిన్నచిన్న గొడవలు జరిగి ఇద్దరూ ఒకరికొకరు దూరమయ్యారు. ఆ తర్వాత ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ప్రియురాలు తన ప్రియుడిని కిడ్నాప్ (Kidnaped) చేసి బలవంతంగా తాళి కట్టించుకుంది. అచ్చం టీవీ సీరియల్స్‌లో లేడీ విలన్‌లను గుర్తుకుతెస్తున్న ఈ హార్డ్‌కోర్ లవ్‌స్టోరీ చివరికి ఆ ప్రియురాలిని కటకటాలపాలు చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పార్తిబన్, వెళ్లూర్ జిల్లాలోని రాణిపేటకు చెందిన యువతి సౌందర్య ఇద్దరూ ప్రేమికులు. దాదాపు ఏడేళ్లపాటు వారి ప్రేమాయణం కొనసాగింది. ఆ తర్వాత పార్తిబన్‌కు, సౌందర్యకు మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. ఈ క్రమంలో పార్తిబన్ ఇటీవల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు.
ఈ విషయం అతని ప్రియురాలు సౌందర్యకు తెలియడంతో తట్టుకోలేకపోయింది. తాను పార్తిబన్‌ను (Parthiban) మర్చిపోలేకపోతున్నానని, అతడినే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వాళ్లతో చెప్పింది. ఎలాగైనా పార్తిబన్‌తో తనకు పెళ్లి చేయాలని తల్లి ఉమను కోరింది. అనంతరం సౌందర్య తన తల్లి ఉమ, బంధువులు రమేశ్, శివకుమార్‌లతో కలిసి పార్తిబన్ కిడ్నాప్‌కు స్కెచ్ వేసింది.
రోజూ పార్తిబన్ ఆఫీస్‌కు బయలుదేరే సమయాన్ని గమనించి శుక్రవారం ఉదయం అతని ఇంటి సమీపంలో కారులో కాపుగాశారు. అతను బయటికి రాగానే బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా కాంచీపురంలోని ఓ ఆలయానికి తీసుకెళ్లి సౌందర్య మెడలో తాళి కట్టించారు. ఇంతలో తన భర్త కిడ్నాప్‌కు గురయ్యారంటూ పార్తిబన్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పార్తిబన్ భార్య ఫిర్యాదు ఆధారంగా ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా ప్రాంతంలోని సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు పార్తిబన్ మాజీ ప్రియురాలు, ఆమె బంధువులుగా గుర్తించారు. అనంతరం నిందితులు ముగ్గురిని వెతికి అదుపులోకి తీసుకున్నారు. పార్తిబన్‌ను వారి నుంచి విడిపించారు.