Arvind Kejriwal: లిక్కర్ స్కామ్ లో విచారణకు సిద్ధం, ఈడీ తనపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటీషన్, విచారణకు హాజరయ్యేందుకు రెడీ అంటూ ప్రకటన
విచారణకు రాకపోవడంతో ఈడీ సైతం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేయగా.. ఆయన బెయిల్ దక్కించుకున్నారు. అయితే తనను ఈడీ కచ్చితంగా అరెస్ట్ చేస్తుందన్న అనుమానాల నేపథ్యంలో ఆయన ఈ ఉదయం ఢిల్లీ హైకోర్టులో (Delhi High Court) హడావిడిగా మరో పిటిషన్ వేశారు.
New Delhi, March 21: ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) తాను లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు సిద్ధమని ప్రకటించారు. నేడు ఈడీ విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో.. తాజాగా ఢిల్లీ హైకోర్టులో మరో పిటిషన్ వేశారాయన. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ నిమిత్తం ఇవాళ హాజరు కావాలంటూ ఈడీ ఆయనకు సమన్లు (ED Summons) జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే తొమ్మిదిసార్లు సమన్లు జారీ అయ్యాయి. విచారణకు రాకపోవడంతో ఈడీ సైతం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేయగా.. ఆయన బెయిల్ దక్కించుకున్నారు.
అయితే తనను ఈడీ కచ్చితంగా అరెస్ట్ చేస్తుందన్న అనుమానాల నేపథ్యంలో ఆయన ఈ ఉదయం ఢిల్లీ హైకోర్టులో (Delhi High Court) హడావిడిగా మరో పిటిషన్ వేశారు. ఈడీ విచారణకు తాను సిద్ధమని, ఈడీ తనపై కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలంటూ ఆయన పిటిషన్ వేశారు.