Miram Taron: తప్పిపోయిన భారత యువకుడిపై చైనా ఆర్మీ ప్రతాపం, కాళ్లతో తన్ని, కరెంట్ షాకిచ్చిన చైనా, చావు నుంచి బయటపడ్డానంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న మిరామ్
ఇటీవల చైనా భూభాగంగంలో గల్లంతయిన భారతీయ బాలుడు మిరమ్ తరోన్ (Mirom Taron) ను చైనా ఆర్మీ హింసినట్లు అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జనవరి 18న మిరమ్ తరోన్ కనిపించకుండా పోయాడు.
Agartala, Feb 02: డ్రాగన్ కంట్రీ మరోసారి తన వక్రబుద్దిని చూపించింది. ఇటీవల చైనా భూభాగంగంలో గల్లంతయిన భారతీయ బాలుడు మిరమ్ తరోన్ (Mirom Taron) ను చైనా ఆర్మీ హింసినట్లు అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జనవరి 18న మిరమ్ తరోన్ కనిపించకుండా పోయాడు. దీనిపై భారతీయ ఆర్మీ(Indian Army) వెంటనే స్పందించి ఆచూకీ కనిపెట్టమని చైనా ఆర్మీ(China army)ని కోరింది. అనంతరం తమ బంధీగా ఉన్న మిరమ్‌ను.. పలు చర్చల అనంతరం జనవరి 27న చైనా ఆర్మీ మిరామ్‌ను భారత్‌కు అప్పగించింది.అయితే అప్పటిదాకా బంధీగా ఉంచుకుని.. అప్పగించే ముందు తమ కొడుకును చైనా సైన్యం చిత్ర హింసలు పెట్టిందని బాలుడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అయ్యారు.
చైనా సైనికులు మిరమ్ తరోన్‌ను చాలాసార్లు తన్నారని(Kicked), రెండుసార్లు కరెంట్ షాకిచ్చారని (given electric shock) తండ్రి ఓపాంగ్ తరోన్ ఆరోపించారు. కుమారుడి రాక సంతోషాన్నిచ్చిందని, కానీ మిరామ్‌ను చైనా బాధించిందని ఆ పేద రైతు వాపోయారు. చైనా భూభాగంలోకి వచ్చినట్లు గమనించి తప్పించుకోవడానికి మిరమ్ యత్నించాడని, కానీ చైనా సైనికులు పట్టుకొని హింసించారని ఓపాంగ్ చెప్పారు. అనంతరం మిరమ్‌ను బంధించి టిబెట్ భాషలో ప్రశ్నించారని, వారి భాష అర్థం కాక తన కుమారుడు సరైన సమాధానమివ్వకపోవడంతో కరెంటు షాకులిచ్చారని తెలిపారు.
ఎప్పుడైతే మిరమ్ మిస్సింగ్ వార్త మీడియాలో వచ్చిందో.. ఆపై హింసించడం మానుకున్నారన్నారు. ఇప్పటికీ తన కుమారుడు చాలా బాధను అనుభవిస్తున్నాడన్నారు. మిరమ్‌కు చికిత్సనందిస్తామని భారత ఆర్మీ అభయం ఇచ్చినట్లు తెలిపారు.