Rajinikanth Meets Akhilesh Yadav: యూపీ మాజీ సీఎం అఖిలేష్‌తో రజినీకాంత్ భేటీ, మేమిద్దరం ఎప్పటినుంచో మిత్రులం, తరచూ ఫోన్‌లో మాట్లాడుకుంటామన్న రజినీ

ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌తో (AKhilesh Yadav) సమావేశమయ్యారు. ఆదివారం ఉదయాన్నే అఖిలేష్‌ నివాసానికి వెళ్లిన రజినీకాంత్‌ను ఆయన సాదరంగా స్వాగతించారు.

Rajinikanth Meets Akhilesh Yadav (PIC@ ANI X)

Lucknow, AUG 20: స్టార్‌ హీరో రజినీకాంత్‌ (Rajinikanth).. ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌తో (AKhilesh Yadav) సమావేశమయ్యారు. ఆదివారం ఉదయాన్నే అఖిలేష్‌ నివాసానికి వెళ్లిన రజినీకాంత్‌ను ఆయన సాదరంగా స్వాగతించారు. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. అనంతరం అఖిలేష్‌ నివాసం నుంచి బయటికి వచ్చిన రజినీకాంత్‌ మీడియాతో మాట్లాడారు. అఖిలేష్‌ యాదవ్‌ను తాను తొమ్మిదేళ్ల క్రితం ముంబైలో జరిగిన ఓ ఫంక్షన్‌లో కలిశానని, అప్పటి నుంచి తామిద్దరం స్నేహితులమయ్యామని రజినీ (Rajinikanth Meets Akhilesh Yadav) చెప్పారు. ఇద్దరం తరచూ ఫోన్‌లో మాట్లాడుకుంటామని అన్నారు.

 

ఐదేళ్ల క్రితం కూడా తాను ఓ సినిమా షూటింగ్‌ కోసం లక్నోకు వచ్చానని, కానీ అతను లక్నోలో లేకపోవడంతో కలవలేకపోయానని అన్నారు. ఇప్పుడు ఆయన లక్నోలోనే ఉన్నాడని తెలుసుకుని కలిశానని చెప్పారు.