AGNIPATH Scheme: ఆర్మీలో 46 వేల ఉద్యోగాలు, అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్ ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయసులోపు వారికి అవకాశం
ఆర్మీలో యువతను నింపాలనే ఉద్ధేశ్యంతో వారి కోసం కొత్త స్కీమ్‌ను ప్రకటించింది. అదే అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్. ఈ స్కీమ్ ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం (14,2022) ప్రకటించారు.
New Delhi, June 14: దేశంలోని యువత కోసం రక్షణశాఖ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆర్మీలో యువతను నింపాలనే ఉద్ధేశ్యంతో వారి కోసం కొత్త స్కీమ్‌ను ప్రకటించింది. అదే అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్. ఈ స్కీమ్ ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం (14,2022) ప్రకటించారు. అగ్నిపథ్ స్కీమ్ (AGNIPATH Scheme) కింద దేశంలోని యువతను దేశ రక్షణ దళంలోకి తీసుకునే అవకాశం దీని ద్వారా కల్పించబడుతుందని తెలిపారు.
కొత్త టెక్నాలజీతో యువతకు ( Recruitment of Youth in Armed Forces) శిక్షణ ఇవ్వనున్నారు. సైన్యంలో చేరే యువత ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఈ పథకం కింద యువత నాలుగు సంవత్సరాల పాటు దళాలలో చేరి దేశానికి సేవ చేస్తారు. కొలువుల జాతర, రానున్న ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు, ప్రధాని నరేంద్రమోదీ కీలక నిర్ణయం, ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్
అగ్నిపథ్ స్కీమ్ కింద సైన్యంలోకి సుమారు 46 వేల మందిని రిక్రూట్ చేయనున్నారు. 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయసులోపు వారే దీంట్లో ఉంటారు. అయితే నాలుగేళ్ల పాటు యువత సర్వీసులో ఉంటుంది. నాలుగేళ్ల తర్వాత కేవలం 25 శాతం మంది సైనికుల్ని మాత్రమే ఆర్మీలోకి రెగ్యులర్ క్యాడర్‌గా తీసుకుంటారు. వాళ్లు మాత్రమే 15 ఏళ్ల సర్వీస్‌లో ఉంటారు. మిగతా వాళ్లకు మంచి వేతన ప్యాకేజీ (ఎగ్జిట్ రిటైర్మెంట్ ప్యాకేజీ) ఇచ్చి ఇంటికి పంపిస్తారు. ఉపాధి గురించి మాట్లాడుతూ..మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, ‘అగ్నిపథ్’ పథకం కింద..సాయుధ దళాల యువత ప్రొఫైల్‌ను రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇది వారికి కొత్త సాంకేతికతలకు శిక్షణ ఇవ్వడానికి..వారి ఆరోగ్య స్థాయిలను మెరుగుపరచడానికి సహాయపడుతుందని తెలిపారు.