Tejas Express: గంటకు 200 కిలోమీటర్ల వేగం, రైలు గంట ఆలస్యంగా వస్తే ప్రయాణికులకు రూ.100, రైల్వే ప్రయాణికులకు రూ.25 లక్షల ఉచిత బీమా, 60 రోజుల ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలి, ప్రారంభమైన తేజస్ ఎక్స్‌ప్రెస్‌

కార్యక్రమంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని(Gujarat Chief Minister Vijay Rupani), రాష్ట్ర మంత్రులు, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Ahmedabad-Mumbai Tejas Express flagged off (Photo-IANS)

Ahmedabad, January 17: అహ్మదాబాద్-ముంబైల మధ్య తేజస్ ఎక్స్ ప్రెస్ (Ahmedabad-Mumbai Tejas Express)రైలును కేంద్రమంత్రి పియూష్ గోయల్(Railway Minister Piyush Goyal ) అహ్మదాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని(Gujarat Chief Minister Vijay Rupani), రాష్ట్ర మంత్రులు, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రైలు అహ్మదాబాద్‌ నుంచి ఉదయం 6:40 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 13:10 గంటలకు ముంబై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. తిరిగి ముంబై సెంట్రల్‌ నుంచి మధ్యాహ్నాం 3:40 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 9:55 గంటలకు అహ్మదాబాద్‌ చేరుకుంటుంది. మధ్యలో నదియాడ్‌, వడోదర, భారుచ్‌, సూరత్‌, వాపీ, బొరివలి స్టేషన్‌లలో రైలు ఆగుతుంది.

ఈ సందర్భంగా పీయుష్‌గోయల్‌ మాట్లాడుతూ... రైలు నడిచే టైంటేబుల్‌ను ప్రకటించామని, జనవరి 19వ తేదీ నుంచి రెగ్యులర్‌గా వారానికి 6 రోజలు రైలు నడుస్తుందని తెలిపారు.

Here's ANI Tweet

పూర్తి ఏసీతో కూడిన ఈ రైలు 736 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, ఐఆర్‌సీటీసీ రైల్‌ కనెక్ట్‌ ముబైల్‌ యాప్‌లో టికెట్‌ రిజర్వేషన్‌ తీసుకోవచ్చు. తత్కాల్‌ కోటా, ప్రీమియం తత్కాల్‌ కోటా ఇందులో లేవు. జనరల్‌ కోటా, విదేశీ టూరిస్ట్‌ కోటా మాత్రమే ఉన్నాయి.

ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త, అమల్లోకి ఓటీపీ ఆధారిత టిక్కెట్‌ రద్దు విధానం

ప్రయాణికులందరికీ ఐఆర్‌సీటీసీ ద్వారా రూ.25 లక్షల ఉచిత బీమా కల్పిస్తున్నాం. రైలు ఆలస్యం అయితే గంట ఆలస్యానికి రూ.100, రెండు గంటల ఆలస్యానికి రూ.250లను ఐఆర్‌సీటీసీ (IRCTC) పరిహారంగా చెల్లిస్తుంది. ప్రతీ ప్రయాణికుడికి ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ బాటిల్ కు అదనంగా ప్రతి కోచ్‌లో ఆర్‌వో వాటర్‌ ఫిల్టర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. రైలులో ప్రయాణించాలనుకునే వారు 60 రోజుల ముందు నుంచి రిజర్వేషన్‌ చేసుకోవచ్చని వెల్లడించారు.

Here's ANI Tweet

ఈ రైలు గంటకు గరిష్టంగా 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ముంబై నుంచి గోవా వరకు మొత్తం 579 కిలోమీటర్ల దూరాన్ని ఈ ట్రెయిన్ కవర్ చేస్తుంది. అందుకు గాను ఈ రైలుకు దాదాపుగా 8 గంటల సమయం పడుతుంది. త్వరలో ఢిల్లీ-చండీగడ్, ఢిల్లీ-లక్నో మార్గాల్లో కూడా ఇలాంటి రైళ్లను నడపనున్నారు.

బ్యాన్ దిశగా డిస్కౌంట్ సేల్స్

ఇక తేజస్ రైలులో(Tejas Express) ముంబై నుంచి గోవా ఎగ్జిక్యూటివ్ క్లాస్‌ లో ప్రయాణించాలంటే రూ.2,525 చార్జి అవుతుంది. ఆహారం కావాలనుకుంటే రూ.2,680 వరకు ఒకరికి చార్జి అవుతుంది. అదే చెయిర్ కార్‌లో వెళితే రూ.1,155 వరకు ఒకరికి చార్జి చేస్తారు. ఫుడ్ కావాలనుకుంటే వీరు రూ.1,280 చెల్లించాల్సి ఉంటుంది. తేజస్ రైలును సీజన్‌లో వారానికి 5 రోజులు నడపనున్నారు. అన్‌సీజన్‌లో వారానికి 3 రోజులే నడుస్తుంది.

ప్రయాణీకులకు రైల్వే శాఖ తీపి కబురు, ప్యాసింజర్ల కోసం అదనపు సీట్లు

. మొత్తం 32 బోగీలను ప్రయాణికుల కోసం ఏర్పాటు చేశారు. ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో 20 కోచ్‌లు , చెయిర్ కార్ లో 12 కోచ్‌లు ఉంటాయి.ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో ఒక్కో బోగీకి 56 మంది ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. అదే చెయిర్ కార్‌లో అయితే 78 మంది వరకు ప్రయాణించవచ్చు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్

ఈ రైలులో ప్రయాణికుల సీట్ల వెనుక ఏర్పాటు చేసిన ఎల్‌సీడీ తెరలపై జీపీఎస్ ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లేను ప్రదర్శించనున్నారు. దీంతో రైలు ఎక్కడుందో ప్రయాణికులకు సులభంగా తెలుస్తుంది.



సంబంధిత వార్తలు

Union Budget 2025-26: వేత‌న‌జీవుల‌కు త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్, రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు ట్యాక్స్ మిన‌హాయింపు ఇచ్చే యోచ‌న‌లో కేంద్రం, ఈ బడ్జెట్ లో బొనాంజా ప్ర‌కటించే ఛాన్స్

K Annamalai on Sandhya Theatre Incident: తెలంగాణ‌లో అన్నీ వదిలేసి సినిమావాళ్ల వెంట‌ప‌డుతున్నారు! సీఎం రేవంత్ రెడ్డిపై త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Nitin Gadkari on Same-Sex Marriages: స్వలింగ వివాహాలను అనుమతిస్తే ఒక పురుషుడికి ఇద్దరు భార్యలను కూడా అనుమతించాలి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

Mumbai Boat Accident Update: ముంబై బోటు ప్రమాదం, గల్లంతైన వారి కోసం ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ఆసుపత్రిలో చేరిన 105 మందిలో 90 మంది డిశ్చార్జ్, ఇద్దరి పరిస్థితి విషమం