Irctc tickets bonanza! Stop Worrying About Confirmed Tickets: Railways Now Offers 4 Lakh Extra Berths (Photo-ANI)

New Delhi, October 19: ఇండియన్ రైల్వే ప్రయాణీకులకు శుభవార్తను మోసుకొచ్చింది. రైలు ప్రయాణాలు ఎక్కువ చేసే వారికోసం ఇన్నోవేటివ్ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. పండుగ సంధర్భంగా ఎక్కువ రద్దీని దృష్టిలో ఉంచుకొని, ప్రయాణికులకు సుఖవంతమైన జర్నీని అందించడంలొ భాగంగా ఇకపై ఎక్కువ సీట్లు  అందుబాటులోకి రానున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం పలు రైళ్లకు రెండు అదనపు బోగీలు యాడ్ కానున్నాయి. అయితే సాధారణంగా కరెంట్ కోసం రెండు పవర్ కార్ జనరేటర్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ జనరేటర్ల నుంచే ఫ్యాన్లు, లైట్లు, మొబైల్ చార్జీంగ్ పాయింట్లు, ఇతర ఆన్‌బోర్డ్ ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్‌కు పవర్ అందుతుంది.

అయితే ఇప్పుడు వీటి స్థానంలో పర్యావరణానికి హాని కలిగించిన విధంగా ఈకో ప్రెండ్లీ టెక్నాలజీని ఏర్పాటు చేయనున్నారు.  ఇందులో హెచ్ఓజీ (హెడ్ ఆన్ జనరేషన్) వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. మొత్తం ఈకో ప్రెండ్లీ సిస్టంతో రైళ్లు కొత్తగా రానున్నాయి. తద్వారా ప్యాసింజర్లకు అదనపు బెర్త్‌లు లభించనున్నాయి.

రైల్వే శాఖా మంత్రి పియూష్ గోయెల్ ట్వీట్

పలు రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, డురొంటో ఎక్స్‌ప్రెస్, సంపర్క్ క్రాంతి, హంసఫర్ ఎక్స్‌ప్రెస్, మెయిల్/ఎక్స్‌ప్రెస్ ట్రైన్లలో ఇప్పటికే ఈ విధంగా ఎక్కువ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రైల్వేస్‌కు ఆదాయం పెరగడంతో పాటుగా డీజిల్ వ్యయాలు కూడా తగ్గనున్నాయి.

ఎక్కువ సీట్లు అందుబాటులోకి రావడంతో ప్రయాణీకులకు ట్రైన్ టికెట్ బెర్త్‌లు కూడా కన్ఫర్మ్ అవుతాయి. టెక్నాలజీ పుణ్యమా అని రైల్వే శాఖ నిర్ణయంతో మూడు ప్రయోజనాలు కలుగనున్నాయి. ప్రయాణికులకు ఎక్కువ సీట్లు, రైల్వే టికెట్ ఆదాయం పెరగడం, రైల్వేకు డీజిల్ వ్యయాలు తగ్గడం అనే లాభాలు ఉన్నాయి. ఇప్పటికే నార్త్ రైల్వే జోన్‌లో పలు ట్రైన్లలో ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. మొత్తం 342 రైళ్లలో ఈ సదుపాయాన్ని అందిస్తున్నారు. దీని ద్వారా సంవత్సరానికి దాదాపు రూ. 800 కోట్లు సేవ్ అవుతోందని రైల్వే శాఖ వెల్లడించిన ప్రకటనలో తెలిపింది. ఈ సంవత్సరం ఏడాదికి మరో 284 రైళ్లు హెచ్ఓజీ (హెడ్ ఆన్ జనరేషన్) వ్యవస్థకు మారనున్నాయి.

HOG వ్యవస్థను ఉపయోగించుకుంటున్న ట్రైన్ల వివరాలను ఓ సారి పరిశీలిస్తే..

Rajdhani 13,

Shatabdi 14,

Duronto 11,

Sampark Kranti 06,

Humsafar 16,

Other Mail/ Express 282గా ఉన్నాయి.

HOG వ్యవస్థలోకి మారబోతున్న ట్రైన్ల వివరాలు

Rajdhani 12,

Shatabdi 08,

Duronto 06,

Sampark Kranti 07,

Humsafar 08,

Other Mail/ Express 284గా ఉన్నాయి.