IRCTC Introduces a New OTP based Refund System for Bookings by Authorised Agents (Photo-ANI)

New Delhi,November 12: ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (Indian Railways Catering And Tourism Corporation) ప్రయాణికులకు శుభవార్తను అందించింది. ఈ కొత్త విధానం ప్రకారం ఐఆర్‌సీటీసీ (IRCTC) ఏజెంట్ల ద్వారా బుకింగ్‌ అయిన టిక్కెట్లను వివిధ కారణాలతో రద్దు చేసుకొన్నప్పుడు రీఫండ్‌ నగదు ఎంత అనేది ప్రయాణికుడికి తెలిసిపోతుంది. ఈ నూతన విధానం వల్ల ఏజెంట్లు (Authorised Agents) రీఫండ్‌ నగదులో కోతపెట్టడం, ఇంకా రీఫండ్‌ రాలేదని చెప్పడం వంటి వాటికి చెక్‌ పడుతుందని రైల్వేవర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విధానంలో ప్రయాణికులు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలని సూచించింది.

రైల్వే శాఖ ఓటీపీ ఆధారిత టిక్కెట్‌ రద్దు (New OTP based Refund System) విధానం ప్రకారం.. ఏజెంట్‌ వద్ద టిక్కెట్‌ బుకింగ్‌ చేసుకోవడానికి వెళ్లినప్పుడు ప్రయాణికుడు అందులో తన మొబైల్‌ నెంబర్‌ని తప్పక నమోదు చేయించాలి. అలా చేసినప్పుడు మీరు ప్రయాణం వాయిదా వేసుకుని టిక్కెట్‌ రద్దు చేసినప్పుడు ఓటీపీ (One-Time Password) మీరు ఇచ్చిన మొబైల్‌ నెంబరుకి వస్తుంది.

కొత్త రూల్‌పై ట్వీట్ చేసిన పీయూష్ గోయెల్

అది నమోదు చేస్తేనే టిక్కెట్‌ రద్దు అయి రీఫండ్‌ ఎంత నగదు తిరిగి ఏజెంట్‌ బ్యాంకు ఖాతాకి జమ అయిందో ప్రయాణికుడికి తెలుస్తుంది. అప్పుడు మీరు ఆ మొత్తాన్ని ఏజెంట్‌ నుంచి డిమాండ్‌ చేయొచ్చు. ఈ విధానం(new IRCTC refund rules)పై ప్రయాణికులు స్పష్టమైన అవగాహన ఏర్పరుచుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా దాదాపు 1.7 లక్షల మంది రైల్వే ఏజెంట్లు ఇదిలా ఉంటే రైల్వే ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ కౌంటర్లకు వెళ్లలేనివారు రైలు టిక్కెట్‌ల కోసం ఐఆర్‌సీటీసీ ఏజెంట్లని ఆశ్రయిస్తుంటారు. ఏజెంట్లు టిక్కెట్‌ బుకింగ్‌ చేసినందుకు, రద్దు చేసినందుకు వారికి కమీషన్‌ చార్జీలను ఐఆర్‌సీటీసీ నిర్ణయిస్తుంది.

New IRCTC refund rules

వాటిని టిక్కెట్‌ చార్జీలోనే చేరుస్తారు. అయితే కొంతమంది ఏజెంట్లు అదనపు కమీషన్‌ కోసం ఆశపడుతూ టిక్కెట్‌లో ఎంతమంది ప్రయాణికులు ఉంటే అంతమందికి రూ. 100 చొప్పున అదనపు చార్జీ వసూలు చేస్తున్నారు.

ముఖ్యంగా తత్కాల్‌, ప్రీమియం తత్కాల్‌ టిక్కెట్‌లకు ఈ విధంగా వసూలు చేస్తున్నారు. ఏజెంట్‌లు తమ అధీకృత ఐడీలే కాకుండా కొన్ని ఫేక్‌ పర్సనల్‌ ఐడీలు రిజిస్ట్రేషన్‌ చేసి వాటి ద్వారా టిక్కెట్‌లు బుకింగ్‌ చేస్తున్నారు. ఇటీవలకాలంలో రైల్వే అధికారులు దాడులు నిర్వహించి పర్సనల్‌ ఐడీలతో బుకింగ్‌ చేసిన టిక్కెట్లను సీజ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఏజెంట్ల అక్రమార్జనకు కొంత అడ్డుకట్ట వేసేందుకు రైల్వే శాఖ ఈ ఓటీపీ ఆధారిత టిక్కెట్‌ రద్దు విధానాన్ని తీసుకొచ్చింది.