rape case against an unidentified auto driver at Mumbai (Representation Pic)

Chennai, Nov 3: తమిళనాడులో దారుణ ఘటన వెలుగుచూసి కలకలం రేపింది. కేరళ సరిహద్దుకు సమీపంలోని కోయంబత్తూరులో ఓ ప్రైవేట్‌ కాలేజీలో పీజీ చదువుతున్న విద్యార్థినిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి ఆ యువతి తన స్నేహితుడితో కలిసి కారులో బయలుదేరింది.

రాత్రి వేళ కోయంబత్తూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని ఒక వీధిలో కారును ఆపి మాట్లాడుకుంటున్నారు. ఈ సమయంలో అక్కడికి ముగ్గురు వ్యక్తులు చేరుకున్నారు. ఆగి ఉన్న వాహనాన్ని గమనించి దానిని చుట్టుముట్టారు. ఆ యువతితో ఉన్న మగ స్నేహితుడిని వారు కొట్టి బెదిరించారు. అనంతరం యువతిని బలవంతంగా కారులోంచి లాగి మరో ప్రాంతానికి తరలించారు. అక్కడ ఆమెపై ముగ్గురూ పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

కెన్యాలో ఘోర విమాన ప్రమాదం, కొండ ప్రాంతంలో కుప్పకూలిన టూరిస్టుల‌తో వెళ్తున్న ఫ్టైట్, 12 మంది మృతి చెందినట్లుగా వార్తలు, వీడియో ఇదిగో..

తరువాత బాధితురాలిని అక్కడే వదిలేసి నిందితులు పరారయ్యారు. తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు సమీప పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఈ ఘటనపై కోయంబత్తూర్ పోలీస్‌ కమిషనర్‌ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులను గుర్తించేందుకు ఎయిర్‌పోర్ట్‌ పరిసర ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరించి విశ్లేషిస్తున్నారు. అదేవిధంగా రాత్రి ఆ సమయంలో ఆ ప్రాంతం గుండా వెళ్లిన వాహనాలను కూడా గుర్తిస్తున్నారు.

ఈ దారుణం వెలుగులోకి రావడంతో తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. మహిళల భద్రత విషయంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. “తమిళనాడులో మహిళలు రాత్రివేళ భయపడకుండా బయటికి రావలసిన పరిస్థితి లేదు” అని బీజేపీ నేతలు ఆరోపించారు. ప్రస్తుతం పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటన తమిళనాడులో మహిళా భద్రతపై మరోసారి ఆందోళనను రేకెత్తించింది.