Air India Peeing Incident: ఆరోగ్యం బాలేక ఆ వృద్ధురాలే మూత్రం పోసుకుంది, నేను మూత్ర విసర్జన చేయలేదని తెలిపిన శంకర్‌ మిశ్రా, 14 రోజుల కస్టడీకి నిందితుడు

తను ఆమె పట్ల ఆ విధంగా ప్రవర్తించలేదని (Did Not Urinate on Woman) తెలిపాడు.

Shankar Mishra (Photo Credit: ANI)

New Delhi, January 13: ఎయిర్‌ ఇండియా విమానంలో వృద్ధ మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన ఘటనకు (Air India Peeing Incident) సంబంధించిన కేసు కొత్త మలుపు తిరిగింది.మద్యం మత్తులో 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్‌ మిశ్రా.. తను ఆమె పట్ల ఆ విధంగా ప్రవర్తించలేదని (Did Not Urinate on Woman) తెలిపాడు. వాస్తవానికి వృద్ధురాలిపై తాను (Accused Shankar Mishra) మూత్ర విసర్జన చేయలేదని.. ఆ మహిళే తన సీట్లో మూత్ర విసర్జన చేసుకుందని ఢిల్లీ పాటియాలా కోర్టుకు శుక్రవారం వెల్లడించారు. వృద్ధ మహిళ తనను తానే మూత్ర విసర్జన చేసుకుని తనపై ఆరోపణలు చేస్తోందని ఆరోపించాడు.

విమానంలో మహిళపై మూత్రం పోసిన వ్యక్తి కోసం కొనసాగుతున్న గాలింపు, ఉద్యోగం నుంచి తీసేసిన అమెరికన్ సంస్థ

నిందితుడు శంకర్ మిశ్రాను ఇటీవల బెంగళూరులో అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు ఆయనను ఢిల్లీకి తీసుకెళ్లి పాటియాలా హౌస్ కోర్టు (Patiala House Court)లో హాజరు పరిచారు. అతడిని ప్రశ్నించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరారు. అయితే, పోలీసుల అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు ఆయనను 14 రోజుల జుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. తాజాగా, శంకర్ మిశ్రా కస్టడీ కోరుతూ తాజాగా ఢిల్లీ పోలీసులు సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై సెషన్స్ కోర్టు జారీ చేసిన నోటీసుకు స్పందిస్తూ శంకర్ మిశ్రా పై వ్యాఖ్యలు చేశాడు.

శంకర్ మిశ్రాపై వచ్చిన ఆరోపణలను అసహ్యకరమైనవిగా పేర్కొన్న న్యాయమూర్తి ఆయన పెట్టుకున్న బెయిలు దరఖాస్తును నాలుగు రోజుల తర్వాత తోసిపుచ్చారు. నిందితుడి అసభ్య ప్రవర్తన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందని, బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. మహిళపై తాను మూత్ర విసర్జన చేయలేదన్న మిశ్రా వ్యాఖ్యలను బెయిలు పిటిషన్ సందర్బంగా ఆయన తరపు న్యాయవాదులు ప్రస్తావించకపోవడం గమనార్హం.

విమానంలో దారుణం, ఫ్యాంట్ జిప్పి విప్పి మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఓ వ్యక్తి, సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని లేఖ రాసిన బాధితురాలు

కోర్టులో మిశ్రా తరపు న్యాయవాది మాట్లాడుతూ.. వృద్ధురాలు తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మూత్ర విసర్జన చేసిందని పేర్కొన్నారు. ఆ మహిళ 30 ఏళ్లుగా భరతనాట్యం నృత్యకారిణి అని, వారికి మూత్ర విసర్జన సమస్య రావడం సహజమేనని కోర్టుకు తెలిపారు. వృద్ధురాలి సీటు వద్దకు వెళ్లలేని విధంగా సీటింగ్‌ మూలన ఉందని, అక్కడికి వెళ్లినా సీటు వెనుక వైపు నుంచి మాత్రమే వెళ్లగలరని, నేను మద్యం మత్తులో ఆమె సీటు వద్దకు వెళ్లినా.. మూత్ర విసర్జన చేశానంటే వెనుక సీట్లో కూర్చున్న వారు ఫిర్యాదు చేయాలి కదా? అంటూ ప్రశ్నించాడు.

ఎయిరిండియా విమానంలో పాము.. కార్గో క్యాబిన్ చెక్ చేస్తుండగా కనిపించిన పాము.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న ఎయిరిండియా

కాగా విచారణ నిమిత్తం శంకర్‌ మిశ్రాను కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు పాటియాలా హౌస్ కోర్టును కోరారు. దీనిపై స్పందించిన కోర్టు అతనికి బుధవారం నోటీసులు జారీ చేసింది. అంతేగాక​ మిశ్రా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. కోర్టు నోటీసులపై విచారణ సందర్భంగా మిశ్రా పై వ్యాఖ్యలు చేశాడు. విచారణ సందర్భంగా బాధిత మహిళ మిశ్రాపై కోర్టుకు ఫిర్యాదు చేశారు.

మిశ్రా తరపు వారి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్టు ఆరోపించారు. మిశ్రా తండ్రి తనకు మెసేజ్ పంపుతూ.. ‘కర్మ అనుభవించక తప్పదని’ హెచ్చరించారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆయన ఆ మెసేజ్‌ను డిలీట్ చేశారన్నారు. వారు తనకు మెసేజ్‌లు పంపుతూ డిలీట్ చేస్తున్నారని ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

ఆకాశంలో విమానం, ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందులు పడిన 180 మంది ప్రయాణికులు, ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్

నవంబర్‌ 26న న్యూయార్క్‌లోని జాన్‌ ఎఫ్‌ కెన్నెడీ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి ఎయిర్‌ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ తాగుబోతు తన సీటు వద్దకు వచ్చి మూత్ర విసర్జన చేసినట్లు ఎయిర్‌ ఇండియా చైర్మన్‌కు రాసిన లేఖలో ఆరోపించిన విషయం తెలిసిందే. బట్టలు, బ్యాగులు, బూట్లు పూర్తిగా మూత్రంతో తడిసిపోయాయని మహిళ ఆరోపించింది. ఈ విషయాన్ని సిబ్బంది దృష్టికి తీసుకెళితే ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన తర్వాత వెళ్లిపోయినట్లు పేర్కొంది. ఆ తర్వాత ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎయిర్‌ ఇండియా తెలిపింది. ఘటనపై దర్యాప్తు కోసం అంతర్గత కమిటీని సైతం ఏర్పాటు చేసింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif