Alibaba Left from Paytm: పేటిఎంకు షాక్, తన వాటా అన్ని షేర్లను అమ్మేసిన అలీబాబా, భారత్‌లోని మరిన్ని కంపెనీల్లోనూ వాటాలను విక్రయించనున్న చైనా కంపెనీ
పేటీఎం పేరెంట్ కంపెనీ వన్97 (One97) కమ్యూనికేషన్స్‌లో 2.1 కోట్ల షేర్ల (3.4 శాతం వాటా) ను అలీబాబా శుక్రవారం విక్రయించింది. గతేడాది డిసెంబర్‌లో పేటీఎం నుంచి అలీబాబా 6.26 శాతం, జనవరిలో మూడు శాతం వాటాలను విక్రయించింది. `
New Delhi, FEB 10: దేశీయ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం (Paytm) నుంచి చైనా ఈ-కామర్స్ జెయింట్ అలీబాబా (Alibaba) పూర్తిగా వైదొలిగింది. పేటీఎం పేరెంట్ కంపెనీ వన్97 (One97) కమ్యూనికేషన్స్‌లో 2.1 కోట్ల షేర్ల (3.4 శాతం వాటా) ను అలీబాబా శుక్రవారం విక్రయించింది. గతేడాది డిసెంబర్‌లో పేటీఎం నుంచి అలీబాబా 6.26 శాతం, జనవరిలో మూడు శాతం వాటాలను విక్రయించింది. `పేటీఎం స్టాక్స్‌లో 2,59,930 షేర్లను ఒక్కో షేర్ విలువ రూ.535.90 చొప్పున రూ.13.93 కోట్ల విక్రయం జరిగింది. చైనా ఈ-కామర్స్ సంస్థ అలీబాబా సుమారు ఆరు శాతం వాటాలో 3.1 శాతం విక్రయించింది` అని అలీబాబా వర్గాలను ఉటంకిస్తూ గత నెలలో పీటీఐ ఒక వార్తాకథనం ప్రచురించింది.
భారత్‌లోని ఇతర సంస్థల్లో అలీబాబా తన పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లు కనిపిస్తున్నది అని పేర్కొన్నది. శుక్రవారం పేటీఎం (Paytm) నుంచి అలీబాబా పూర్తిగా వైదొలిగినట్లయింది. అంతకుముందు నవంబర్‌లో ఫుడ్ అగ్రిగేటర్ జొమాటోలో మూడు శాతం వాటాలను అలీబాబా విక్రయించింది. తాజాగా అలీబాబా తన పూర్తి వాటాలను విక్రయించడంతో ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీలో ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం పేరెంట్ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్ 9 శాతం నష్టంతో రూ.640 పాయింట్లకు పడిపోయింది. చివరకు ట్రేడింగ్ ముగింపు దశలో 7.82 శాతం నష్టంతో రూ.650.75 వద్ద నిలిచింది.