Pushpa 2 Tickets Price: పుష్ప 2 సినిమా టికెట్ ధరల పెంపు, డిసెంబర్ 5 నుంచి రోజు ఏడు ఆటలు, బెనిఫిట్ షో టికెట్ ధర ఎంతో తెలుసా?
పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న పుష్ప 2పై భారీ అంచనాలను నెలకొన్నాయి. ఇప్పటికే సినిమా టీజర్ , ట్రైలర్‌తో బన్నీ ఆ అంచనాలను మరింతగా పెంచేశాడు. డిసెంబర్ 6న సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుండగా ఇప్పటికే బన్నీ ఫ్యాన్స్ హంగామా మొదలైంది.
Hyd, Nov 30: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న పుష్ప 2పై భారీ అంచనాలను నెలకొన్నాయి. ఇప్పటికే సినిమా టీజర్ , ట్రైలర్‌తో బన్నీ ఆ అంచనాలను మరింతగా పెంచేశాడు. డిసెంబర్ 6న సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుండగా ఇప్పటికే బన్నీ ఫ్యాన్స్ హంగామా మొదలైంది.
దేశంలోని వివిధ నగరాల్లో సినిమా ప్రమోషన్స్ కార్యక్రమం నిర్వహిస్తుండగా తాజాగా పుష్ప టీంకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పుష్ప 2 టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 4న 9.30 గంటల నుంచి బెనిఫిట్ షోలతోపాటు అర్థరాత్రి 1 గంట షోకు అనుమతి ఇచ్చింది.
అలాగే పుష్ప2 బెనిఫిట్ షోల టికెట్ ధరలు రూ.800 కాగా రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ లో బెనిఫిట్ షో లకు టికెట్ ధరలు రూ.800 గా ఉన్నాయి. అర్థరాత్రి 1 గంట నుంచి తెల్లవారు ఝామున 4 గంటల వరకు అదనపు షోలకు అనుమతిచ్చింది సర్కార్. ముంబైలో పుష్ప అదరగొట్టేశాడు! శ్రీవల్లితో కలిసి డ్యాన్స్ చేసిన బన్నీ, నెట్టింట వైరల్ అవుతున్న పుష్ప-2 ఈవెంట్ (వీడియో ఇదుగోండి)
డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.150, మల్టీఫ్లెక్స్ లో రూ.200 పెంపుకు ఓకే చెప్పింది. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.105, మల్టీఫ్లెక్స్ లో రూ.150 పెంపునకు అనుమతి ఇవ్వగా డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగల్ స్క్రీన్ లో రూ.20, మల్టీఫ్లెక్స్ లో రూ.50 పెంపునకు అనుమతించింది సర్కార్.