Indian Railways: కరోనా ఎఫెక్ట్‌తో ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం, ఎవరి దుప్పట్లు వాళ్లే తెచ్చుకోవాలి, ఏసీ రూముల్లో కొన్ని సదుపాయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటన
ప్రయాణికులు ఎవరికి వారే వారి సొంత బ్లాంకెట్లను తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేసింది. కరోనా వ్యాప్తి చెందడంతో ఏసీ బోగీల్లో ప్రయాణించే ప్రయాణికులకు కర్టెన్లతో పాటు బ్లాంకెట్లను (blankets) కలిపించే సదుపాయాన్ని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు రైల్వే పీఆర్వో ప్రకటించారు.
New Delhi, Mar 15: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి (coronavirus outbreak) తీవ్రమైన ఆందోళనలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ (Indian Railways) అప్రమత్తమైంది. ప్రయాణికులు ఎవరికి వారే వారి సొంత బ్లాంకెట్లను తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేసింది. కరోనా వ్యాప్తి చెందడంతో ఏసీ బోగీల్లో ప్రయాణించే ప్రయాణికులకు కర్టెన్లతో పాటు బ్లాంకెట్లను (blankets) కలిపించే సదుపాయాన్ని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు రైల్వే పీఆర్వో ప్రకటించారు.
రూ.4 లక్షలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న కేంద్రం, కరోనా పేషంట్లకు ఆస్పత్రి ఖర్చులు కూడా చెల్లించదు
ఏసీ బోగీల్లో వినియోగించే కర్టెన్లు, బ్లాంకెట్లను ఓ ట్రిప్ పూర్తి కాగానే ఉతికి శుభ్రపరచడానికి వీలుండదని, ఈ కారణంతో వైరస్ ( Covid-19) సోకే ప్రమాద ముందని ఆయన తెలిపారు. కేవలం బ్లాంకెట్లు మాత్రమే కాకుండా, ప్రయాణికులకు అవసరమైన దుప్పట్లు, ఇతరత్రా వాటిని ఎవరికి వారే తెచ్చుకోవాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
Here's Western Railway Tweet
కాగా కరోనా వైరస్ వ్యాప్తిచెందడంతో భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం, కాన్సులేట్‌లు సోమవారం నుంచి అన్ని వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేశాయి. ఢిల్లీలోని అమెరికా దౌత్యకార్యాలయం శనివారం ఈ మేరకు ప్రకటన చేసింది. మరోవైపు- అత్యవసరంకాని అంతర్గత, విదేశీ ప్రయాణాలు వాయిదావేసుకోవాలని వాషింగ్టన్‌లోని భారత దౌత్య కార్యాలయం అక్కడి విద్యార్థులకు సూచించింది.
కరోనా వైర్‌సపై జరుగుతున్న పరిశోధనల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని పరిశోధనా సంస్థలకు భారత్, అమెరికా సహా డజనుకుపైగా దేశాలు విజ్ఞప్తి చేశాయి. ఈమేరకు ఆయా దేశాల శాస్త్ర,సాంకేతిక శాఖల ఉన్నతాధికారుల సూచనతో కూడిన ఓ సంయుక్త బహిరంగ లేఖను అమెరికాలోని వైట్‌హౌస్ శాస్త్ర,సాంకేతిక విధాన విభాగం డైరెక్టరేట్ జారీ చేసింది.