Arnab Goswami Arrest: డిజైనర్‌ ఆత్మహత్య కేసు, అర్నాబ్ గోస్వామిను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు, పత్రికా స్వేచ్ఛపై దాడి అంటూ మండిపడిన హోం మంత్రి అమిత్ షా, కేంద్ర సమాచార మంత్రి జవదేకర్

ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ ఆత్మహత్యకు సంబంధించి బుధవారం అర్నాబ్‌ను అదుపులోకి తీసుకున్నారని రిపబ్లిక్ టీవీ నివేదించింది.

Arnab Goswami (Photo-PTI)

Mumbai, Nov 14: 2018లో డిజైనర్‌ ఆత్మహత్యకు పురికొల్పారనే ఆరోపణల నేపథ్యంలో (Abetment to Suicide Case) ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్‌ గోస్వామిని ముంబై, రాయ్‌గడ్ పోలీసులు అరెస్టు (Arnab Goswami Arrest) చేశారు. ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ ఆత్మహత్యకు సంబంధించి బుధవారం అర్నాబ్‌ను అదుపులోకి తీసుకున్నారని రిపబ్లిక్ టీవీ నివేదించింది. ఐపీసీ సెక్షన్ 306 కింద గోస్వామిపై అభియోగాలు మోపారని తెలిపింది. కనీసం 20మంది పోలీసులు అర్నాబ్‌పై దాడి చేశారని, ఆపై బలవంతంగా మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌కు తీసుకెళ్లారని ఆరోపించింది.

మే, 2018లో ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్, అతని తల్లి కుముద్ నాయక్‌తో కలిసి అలీబాగ్‌లోని వారి బంగ్లాలో ఆత్మహత్యకు (2018 Suicide Abetment Case) పాల్పడ్డారు. రిపబ్లిక్ టీవీ స్టూడియోలను రూపొందించిన డిజైనర్ అన్వే నాయక్‌కు బిల్లులు చెల్లించకపోవడంతోనే వారు ఆత్మహత్యకు పాల్పడ్డారన్న కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో అర్నాబ్‌పై రాయ్‌గడ్‌లో కేసు నమోదైంది.

Mumbai Police takes Goswami into Police custody, watch Video 

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్థానిక రాయ్‌గడ్ పోలీసులు గోస్వామితో సహా సూసైడ్ నోట్‌లో పేర్కొన్న నిందితులపై తమకు ఆధారాలు దొరకలేదని 2019 ఏప్రిల్‌లో కేసును మూసివేశారు. అయితే, ఈ ఏడాది మేలో, అన్వే కుమార్తె ఈ కేసుపై తిరిగి దర్యాప్తు చేయాలని కోరుతూ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్‌ను ఆశ్రయించారు.

Here's Amit Shah, prakash javadekar Tweets

అర్నాబ్ గోస్వామిని అరెస్టు చేయడానికి ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజ్‌ను పంపినట్లు రిపబ్లిక్ టీవీ తెలిపింది. ఏకే 47, సెమీ ఆటోమేటిక్ ఆయుధాలతో సాయుధ గార్డులు ఆయనపై దాడి చేశారని వ్యాఖ్యానించింది. ఉదయమే తమ ఇంటిపై దాడి చేసిన పోలీసులు ఆర్నాబ్‌ను కొట్టి, జుట్టు పట్టి లాక్కెళ్లారని అర్నాబ్ భార్య సమ్యబ్రాతా రే ఆరోపించారు, కొద్ది సమయం అడిగినా ఇవ్వకుండా, లాయర్‌ వచ్చేంతవరకు వేచి చూడాలని కోరినా వినకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీళ్లు అడిగినా ఇవ్వకుండా తీసుకెళ్లారని మండిపడ్డారు. ఛానెల్‌లోని విజువల్స్ ప్రకారం అర్నాబ్‌ను మొదట కారులో ఉంచి, ఆపై వ్యాన్‌లోకి నెట్టారు. అతన్ని వ్యాన్‌లోకి తీసుకెళ్తుండగా, తన ఇంటి లోపల తనపై, తన కుటుంబ సభ్యులపై దాడి జరిగిందని ఆర్నాబ్ మీడియాకు చెప్పారు.

ఢిల్లీలో మూడవ దశకు చేరుకున్న కరోనా, రోజు రోజుకు పెరుగుతున్న కేసులు, అలర్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, 4 లక్షలు దాటిన కేసులు

ఈ ఘటనపై హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఇది పత్రికా ప్రకటనపై దాడి అని కాంగ్రెస్ మరియు దాని మిత్రదేశాలు మరోసారి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నందుకు సిగ్గుపడుతున్నామని తెలిపారు.ప్రజాస్వామ్యం యొక్క 4 వ స్తంభం అయిన పత్రికపై వ్యక్తిగత స్వేచ్ఛపై దాడి చేయడం అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని హోమంత్రి మండిపడ్డారు.

రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్, ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్టు చేయడంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ స్పందించారు. ఇది ‘‘పత్రికా స్వేచ్ఛపై దాడి" గా అభివర్ణించారు. ఈ ఘటన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందంటూ మహారాష్ట్ర పోలీసుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్‌ చేశారు. మహారాష్ట్రలో పత్రికా స్వేచ్ఛపై దాడిని ఖండిస్తున్నామని పేర్కొన్న ఆయన మీడియా పట్ల ఈ వైఖరి సరైంది కాదంటూ ట్వీట్‌ చేశారు.