AP CM Chandrababu Shubh Aashirwad Function: అనంత్, రాధికా శుభ్ ముహుర్త్ ఆశీర్వాద్ వేడుక‌లో స‌తీ స‌మేతంగా పాల్గొన్న ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ ప‌వ‌న్ క‌ల్యాణ్ (వీడియో)

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu), ఆయ‌న భార్య భువ‌నేశ్వ‌రి, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ (Pawan Kalyan), టాలీవుడ్ హీరో రామ్‌చ‌ర‌ణ్‌, ఆయ‌న భార్య ఉపాస‌న‌, కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌తో పాటు త‌దిత‌రులు హాజ‌రై అనంత్ – రాధికా దంప‌తుల‌ను ఆశీర్వ‌దించారు.

Mumbai, July 13: ప్ర‌పంచ స్థాయి అతిథులు, దేశ సెల‌బ్రిటీల మ‌ధ్య అనంత్ అంబానీ – రాధికా మ‌ర్చంట్‌ల వివాహం (Anant Radhika Wedding) శుక్ర‌వారం రాత్రి అత్యంత ఆడంబ‌రంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల నడుమ అనంత్‌ అంబానీ.. రాధికా మర్చంట్‌ మెడలో మూడు ముళ్లు వేశారు. శుక్రవారం వివాహ మహోత్సవం పూర్తికావడంతో ఇవాళ ‘శుభ్‌ ఆశీర్వాద్‌ ఫంక్షన్‌’ పేరుతో వెడ్డింగ్‌ రిసెప్షన్‌ నిర్వహిస్తున్నారు. కల్యాణ మహోత్సవం జరిగిన ‘జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌’లోనే ఈ వెడ్డింగ్‌ రిసెప్షన్‌ కూడా జరుగుతోంది. ఈ రిసెప్షన్‌కు పలు రంగాలకు చెందిన ప్రముఖులు విచ్చేశారు.

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu), ఆయ‌న భార్య భువ‌నేశ్వ‌రి, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ (Pawan Kalyan), టాలీవుడ్ హీరో రామ్‌చ‌ర‌ణ్‌, ఆయ‌న భార్య ఉపాస‌న‌, కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌తో పాటు త‌దిత‌రులు హాజ‌రై అనంత్ – రాధికా దంప‌తుల‌ను ఆశీర్వ‌దించారు.



సంబంధిత వార్తలు

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో, మున్సిపల్‌ చట్టసవరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం, అమరావతిలో రెండు ఇంజినీరింగ్ కాలేజీల నిర్మాణం

CM Revanth Reddy: ప్రజలకు అందుబాటులో ఉండండి..పాత, కొత్త నాయకులు అంతా కలిసి పనిచేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేల ప్రొగ్రెస్ రిపోర్ట్ త్వరలో వెల్లడిస్తానన్న ముఖ్యమంత్రి

Hyderabad Metro Expansion: మేడ్చల్ టూ శామీర్‌ పేట..మెట్రో విస్తరణ, సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర కానుక,మూడు నెలల్లో డీపీఆర్ తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు

Maoist Tarakka Surrendered: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ, కేంద్ర కమిటీ సభ్యుడు వేణుగోపాల్ భార్య తారక్క లొంగుబాటు, మహారాష్ట్ర సీఎం ఎదుట మరో 10 మందితో పాటూ జనజీవనస్రవంతిలోకి మావోయిస్టులు