Arvind Kejriwal's Bail Plea: అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌ పొడిగింపు అభ్యర్థనపై షాకిచ్చిన సుప్రీంకోర్టు, బెయిల్ పొడిగింపు పిటిషన్‌ విచారణకు నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం

తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజులు పొడిగించాలంటూ అత్యున్నత న్యాయస్థానంలో (Supreme Court) ఢిల్లీ సీఎం పిటిషన్‌ వేసిన (bail extension plea) విషయం తెలిసిందే.

Arvind Kejriwal (Credits: X)

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు సుప్రీంకోర్టులో భారీ షాక్‌ తగిలింది. తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజులు పొడిగించాలంటూ అత్యున్నత న్యాయస్థానంలో (Supreme Court) ఢిల్లీ సీఎం పిటిషన్‌ వేసిన (bail extension plea) విషయం తెలిసిందే. అయితే కేజ్రీవాల్‌ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టబోమని స్పష్టం చేసింది. రెగ్యులర్ బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టు వెళ్లేందుకు ఆయనకు స్వేచ్ఛ ఉందని, అందుకే ఈ పిటిషన్ విచారణకు అర్హమైనది కాదని వెల్లడించింది.

మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకునేందుకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని అభ్యర్థించారు.  క్యాన్సర్‌తో పాటు కిడ్నీ వ్యాధుల లక్షణాలు, అరవింద్ కేజ్రీవాల్ ఆకస్మిక బరువు తగ్గుదల, మధ్యంతర బెయిల్‌ను ఏడు రోజుల పాటు పొడిగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్

దీంతో సర్వోన్నత న్యాయస్థానం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. జూన్‌ 2న తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్‌ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జూన్‌ 9న జైలుకు వెళ్లి లొంగిపోతానని పేర్కొన్నారు.