Assam: డ్రగ్స్ మత్తులో హెచ్ఐవి కొని తెచ్చుకున్న 85 మంది ఖైదీలు, నాగావ్ సెంట్రల్ జైలు, స్పెషల్ జైలులో షాకింగ్ ఘటన, డ్రగ్స్ తీసుకునేటప్పుడు ఒకే సిరంజీ వాడటంతో సోకిన వైరస్
జైలులో శిక్ష అనుభవిస్తున్న ఈ ఖైదీలలో ఏకంగా 85 మంది హెచ్ఐవీ బారినపడడం (special jail test HIV positive) జైలు అధికారులతోపాటు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Nagaon, Oct 10: అస్సాంలోని నాగావ్ సెంట్రల్ జైలు, స్పెషల్ జైలులో మొత్తం 85 మంది ఖైదీలు (85 prisoners of Nagaon central jail) సెప్టెంబర్‌లో హెచ్ఐవి పాజిటివ్‌గా గుర్తించబడ్డారని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఈ ఖైదీలలో ఏకంగా 85 మంది హెచ్ఐవీ బారినపడడం (special jail test HIV positive) జైలు అధికారులతోపాటు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
గత నెలలో ఇక్కడి ఖైదీలకు (prisoners) హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఏకంగా 85 మందికి హెచ్ఐవీ సోకినట్టు తేలడంతో అధికారులు విస్తుపోయారు. అయితే, వీరంతా డ్రగ్స్‌కు అలవాటుపడినవారేనని స్థానిక వైద్యాధికారులు తెలిపారు. డ్రగ్స్ తీసుకునేటప్పుడు వాడే సిరంజీల కారణంగానే ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకి ఉంటుందని చెబుతున్నారు. నాగావ్ బిపి సివిల్ హాస్పిటల్, సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్ సి నాథ్ మాట్లాడుతూ..హెచ్ఐవి పాజిటివ్ పరీక్షించిన 85 మంది ఖైదీలలో, 45 మంది ప్రత్యేక జైలుకు చెందినవారు. మిగతా 40 మంది నాగావ్ పట్టణంలో ఉన్న సెంట్రల్ జైలుకు చెందినవారని తెలిపారు. గత నెలలో మొత్తం నలుగురు మహిళలు సహా 88 మంది సివిల్ హాస్పిటల్‌లో పాజిటివ్ పరీక్షించారని ఆయన చెప్పారు.
నాగావ్ జిల్లా ఆరోగ్య శాఖ వర్గాల ప్రకారం, చాలా మంది హెచ్ఐవి పాజిటివ్ ఖైదీలు మాదకద్రవ్యాలకు బానిసలు అయ్యారని వారు డ్రగ్స్ వాడేందుకు అదే సిరంజిని ఉపయోగించారు, తద్వారా వారు హెచ్ఐవి పాజిటివ్‌గా మారారని తెలిపారు. సెంట్రల్ జైలు మరియు ప్రత్యేక జైలు అధికారులు కూడా సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇచ్చిన సమాచారాన్ని ధృవీకరించారు.