Assam Earthquake: అస్సాంను వణికించిన భూకంపం, రిక్టర్ స్కేలుపై 4.0గా తీవ్రత నమోదు, భయాందోళనలతో పరుగులు తీసిన ప్రజలు
సాయంత్రం 04.18 గంటలకు, నాగావ్ పరిధిలోని పది కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ (జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం) తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. ఈ విషయాన్ని జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది.
Guwahati, FEB 12: అసోంలోని నాగావ్ (Assam) పట్టణంలో ఆదివారం సాయంత్రం భూకంపం (Assam earthquake) సంభవించింది. సాయంత్రం 04.18 గంటలకు, నాగావ్ పరిధిలోని పది కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ (జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం) తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. ఈ విషయాన్ని జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. అయితే, ఈ భూకంపం ప్రభావం ఏమేర ఉంది అనే విషయాలు ఏవీ వెల్లడించలేదు. ప్రజలపై, నివాసాలపై దీని ప్రభావం పెద్దగా లేనట్లు తెలుస్తోంది. నిపుణుల ప్రకారం.. 4.0 తీవ్రత అంటే ఇది చాలా చిన్న భూకంపమే.
అయితే, టర్కీ, సిరియాల్లో నమోదైన భూకంప తీవ్రతకు దగ్గరగా ఉంది. అక్కడ 7.8 తీవ్రత నమోదైంది. టర్కీ, సిరియాల్లో భూకంప తీవ్రత చూసిన తర్వాత భూకంపం అంటేనే ప్రపంచం వణికిపోయే పరిస్థితి ఉంది. అయినప్పటికీ, ఇండియాతోపాటు పలు చోట్ల, ఏదో ఒక సమయంలో భూమి కంపిస్తూనే ఉంది. శనివారం గుజరాత్‌లోని సూరత్‌లో కూడా స్వల్ప భూకంపం సంభవించింది. హజిరా జిల్లాలో అరేబియా సముద్ర తీరంలో 5.2 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం కనిపించింది. దీని తీవ్రత 3.8గా నమోదైంది. అయితే, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.