Bharat Jodo Nyay Yatra: రాహుల్ గాంధీపై మరో కేసు నమోదు, భారత్ జోడో న్యాయ్ యాత్రలో నిబంధనలు ఉల్లంఘించారని కేసు నమోదు చేసిన అస్సాం పోలీసులు
భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) మార్గంపై ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించారంటూ అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నుంచి రాహుల్ గాంధీ నేతృత్వంలో మొదలుపెట్టిన ఈ యాత్ర గురువారం అస్సాంకు చేరుకుంది
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అస్సాంలో మరో కేసు నమోదైంది. భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) మార్గంపై ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించారంటూ అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నుంచి రాహుల్ గాంధీ నేతృత్వంలో మొదలుపెట్టిన ఈ యాత్ర గురువారం అస్సాంకు చేరుకుంది.రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి యాత్ర రూట్స్ ( yatra route)లో మార్పులు చేయడంతో పోలీసులు.. యాత్ర నిర్వాహకుడు కేబీ బైజు (KB Byju)పై కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం రాహుల్ యాత్ర అస్సాంలోని జోర్హాట్ పట్టణంలో కొనసాగుతోంది. అయితే తాము ముందుగా నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలోకి యాత్రను మళ్లించినట్లు అస్సాం పోలీసులు తెలిపారు. చార్ట్‌లో చూపించని మార్గాన్ని ఎంచుకున్నారని పేర్కొన్నారు. రూట్‌ను అకస్మాత్తుగా మార్చడం అంతరాయాలకు దారితీసినట్లు తెలిపారు. యాత్ర నిర్వాహకులు, సహ నిర్వాహకులు ట్రాఫిక్ బారికేడ్‌లను బద్దలు కొట్టేలా అక్కడి సమూహాన్ని ప్రేరేపించారని ఆరోపించారు. ఈ క్రమంలో అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిపై కూడా దాడి చేసినట్లు తెలిపారు.
గోడ మీద కమలం గుర్తుకు రంగు వేసిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, వీడియో ఇదిగో..
భారత్ జోడో న్యాయ్ యాత్ర’పై కేసు నమోదు చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. యాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని కాంగ్రెస్‌కు చెందిన అస్సాం ప్రతిపక్ష నేత దేబబ్రత సైకియా (Debabrata Saikia) మండిపడ్డారు.రాహుల్ న్యాయ్ యాత్ర విజయవంతమవుతోందన్న భయంతోనే.. సీఎం హిమంత శర్మ తమ యాత్రకు ఆటంకం కలిగించాలనుకుంటున్నారని ఆరోపించారు.