Astrology: డిసెంబర్ 5 శుక్ర సంచారం కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

శుక్రుని ఆశీర్వాదం పొందిన రాశుల వారికి ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి

astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం ఆనందం శ్రేయస్సు అదృష్టం సంపదకు కలలకు పాలించే గ్రహంగా చెప్పవచ్చు. శుక్రుని ఆశీర్వాదం పొందిన రాశుల వారికి ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలు కలిగి ఉంటాయి. డిసెంబర్ 4వ తేదీన మధ్యాహ్నం 12 గంటలు ఐదు నిమిషాలకు శుక్రుడు ధనస్సు రాశిని వదిలి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ శుక్రుని అనుగ్రహం పొందే ఆ మూడు రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మకర రాశి- మకర రాశి వారికి శుక్రుని సంచారం కారణంగా అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. వీరికి అంతా శుభం జరుగుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపార వార్తలకు ఈ నెల మొత్తం ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాత రుణాలను సులభంగా తిరిగి చెల్లిస్తారు. సంపదలో పెరుగుదల ఉంటుంది. మీ భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు.

Vastu Tips: బెడ్రూంలో పొరపాటును కూడా ఈ వస్తువులను ఉంచకండి, 

తులారాశి- తులారాశి వారికి శుక్రుని అనుగ్రహం వల్ల అన్ని శుభ ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతుంటే ఆ సమస్య నుంచి బయటపడతారు. మీరు పని చేసే చోట పని భారం తగ్గుతుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాపార విస్తరణ కోసం విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. మీరు రూపొందించిన ప్రణాళికలు విజయవంతం అవుతాయి. వ్యాపారవేత్తలకు ఈ సంవత్సరం చివరి నాటికి లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. వీరు వారి తల్లిదండ్రుల నుండి బహుమతులు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు సమస్యలు నుండి బయటపడతారు. ఇది మీకు మానసికంగా ఉపశమనాన్ని కలిగిస్తుంది.

సింహరాశి- సింహరాశిలో జన్మించిన వారికి శుక్రుని సంచారం కారణంగా జీవితం మొత్తం సంతోషంగా ఉంటుంది. వీరు ప్రేమ వివాహాలకు అనుకూలం జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఇది మీకు ధైర్యాన్ని తీసుకొని వస్తుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారవేత్తలలో పెట్టుబడి నుంచి మంచిరాబడి పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి లాభాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగం చేసే వారికి ఈ నెల చివరిలోపు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా మీ ఆదాయం పెరుగుతుంది. మీరు ఏ పనిని చేపట్టిన అది విజయవంతం అవుతుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో వారికి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారం ద్వారా ఆకస్మిక ధన లాభం వస్తుంది. పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్తులు తిరిగి వస్తాయి. దీని ద్వారా మీ ఆదాయం పెరుగుతుంది సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.