Astrology: కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఈ నియమాలు పాటించండి లేకపోతే వాస్తు దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి..

ఇది ఒక పెద్ద కల దీని కోసం వారు జీవితం మొత్తం కూడా కష్టపడుతూ ఉంటారు. సొంత ఇల్లు కట్టుకోవడం వల్ల వారికి చాలా ఆనందంగా ఉంటుంది

pooja

చాలామందికి సొంత ఇంటిని కొనుగోలు చేయాలని కళ అందరికీ ఉంటుంది. ఇది ఒక పెద్ద కల దీని కోసం వారు జీవితం మొత్తం కూడా కష్టపడుతూ ఉంటారు. సొంత ఇల్లు కట్టుకోవడం వల్ల వారికి చాలా ఆనందంగా ఉంటుంది. అయితే గృహప్రవేశం చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను పాటించడం వల్ల ఆ ఇంట్లో అంతా మంచి జరుగుతుంది. లేకపోతే కొన్ని సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా వాస్తు దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చేయవలసిన కొన్ని పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రోజున ప్రవేశించవద్దు- వాస్తు శాస్త్రం ప్రకారం ఆదివారం, మంగళవారం ,శనివారం పొరపాటున కూడా ఈ మూడు రోజుల్లో కొత్త ఇంటి గృహప్రవేశం చేయకూడదు. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడతాయి. అంతేకాకుండా మీ ఇంట్లో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆర్థికపరంగా అనారోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Vastu Tips: వ్యాపారంలో నష్టం తట్టుకోలేక పోతున్నారా,

మంచి తేదీ ,సమయాన్ని చూసుకోవాలి- కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు మీ జాతకం ప్రకారం మీ ఇంట్లో ప్రవేశించేటప్పుడు ఏ తేదీన ఏ సమయంలో గృహప్రవేశం చేయాలో పండితులను అడిగి తెలుసుకోవాలి. ఇలా చేస్తేనే మీకు శుభ ఫలితాలు అద్భుత అదే సమయంలో శుభముహూర్తాలు లేకుండా కూడా ఇంట్లోకి ప్రవేశించవద్దు. దీని ద్వారా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. మీ పైన నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది..

పూజలు చేయకుండా ప్రవేశం చేయకూడదు- వాస్తు శాస్త్రం ప్రకారం కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఇంటికి మంచిగా అలంకరణలు చేసుకోవాలి. పూజ చేయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ నశించి పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. ఈ సందర్భంగా పండితులతోటి మంచిగా పూజలు చేయించి గృహప్రవేశం చేస్తే మంచిది..

వినాయకుడికి పూజ చేయాలి- మీరు కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు ముందుగా వినాయకుని పూజించాలి. ఎందుకంటే వినాయకుడు అనేక రకాల విజ్ఞాలను తొలగిస్తాడు. కాబట్టి అనేక రకాల సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వినాయకుని పూజించినట్లయితే ఆ ఇబ్బందులు తొలగుతాయి. శరణ కోరేవారికి ఆ వినాయకుడు ఎప్పుడు కూడా మంచిని చేస్తాడు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.