Astrology: నవంబర్ 26 న మార్గశిర కృష్ణపక్ష ఏకాదశి ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

ఈసారి నవంబర్ 26వ తేదీ మంగళవారంన కృష్ణపక్ష ఏకాదశి వస్తుంది.

astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర కృష్ణపక్ష ఏకాదశిన చాలా మంచి జరుగుతుందని భావిస్తారు. ఈసారి నవంబర్ 26వ తేదీ మంగళవారంన కృష్ణపక్ష ఏకాదశి వస్తుంది. ఇది శ్రీమహావిష్ణువుకి ,లక్ష్మీదేవికి ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంది. దీని ద్వారా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.. ఈ ఏడాది ఒకే రోజున మూడు శుభయోగాలు రాబోతున్నాయి. నవంబర్ 26వ తేదీన ప్రీతి యోగం, ఆయుష్మాన్యోగం ,ద్విపుష్కర యోగం, మూడు కూడా ఏర్పడుతున్నాయి. ఇది మంచి శుభ ఫలితాలను అందించే విధంగా ఉంటుంది. ఈ మూడు రాశుల వారికి ఇది అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మిథున రాశి- మిథున రాశిలో పుట్టిన వారికి ఆర్థికంగా చాలా లాభాలు ఉంటాయి. వ్యాపారంలో కొత్త కొత్త కష్టాలు వస్తారు. దీని ద్వారా మీ అమ్మకాలు పెరుగుతాయి. భారీ లాభాలు వస్తాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ అందుతుంది. దీంతో సమాజంలో మీకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త కొత్తగా ఆస్తులను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కోరుకున్న కళాశాలలో ప్రవేశాన్ని పొందుతారు. ఆరోగ్య ప్రయోజనాలు మంచిగా ఉంటాయి. కుటుంబంలో శాంతి ఆనందం ఉంటుంది. వైవాహిక జీవితంలో సంబంధాలు బలపడతాయి.

Vastu Tips: వాస్తు ప్రకారం ఈ చిత్రపటాలను గోడకు తగిలిస్తే, 

కర్కాటక రాశి- కర్కాటక రాశి వారికి ఇది పెట్టుబడులు పెట్టడానికి చాలా మంచి సమయం. మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. అప్పుల నుండి విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో మీకు స్థిరత్వం ఉంటుంది. పని భారం తక్కువగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పని కూడా మీ యజమానికే నచ్చుతుంది. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పరచుకోవడానికి వ్యాపారణ విస్తరణ కోసం మీరు చేసే పనులు లాభంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ఉద్యోగ పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు దూరమవుతాయి. విహారయాత్రలకు వెళతారు. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు.

తులారాశి- తులారాశి వ్యక్తులకు ఈ ఏకాదశి నుండి చాలా మంచి లాభాలు ఉంటాయి. వీరిలో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఇది మీకు సంపదను ఇచ్చే విధంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. దీని ద్వారా మీ జీతం రెట్టింపు అవుతుంది. వ్యాపారంలో కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆన్లైన్ ద్వారా మీరు చేసే మార్కెటింగ్ వ్యాపారం విస్తరిస్తుంది. రిటైల్ వ్యాపారులకు కూడా ఇది చాలా మంచి సమయం విద్యార్థులకు వారు కోరుకున్న రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పూర్వీకుల నుండి రావలసిన ఆస్తి పొందే అవకాశం ఉంది. భూమి లేదా ఇల్లును కొనుగోలు చేస్తారు. మీరు దీన్ని తిరిగి అమ్మేటప్పుడు ఎక్కువ ధరకు అమ్మే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని భారం తగ్గుతుంది ఇది మానసిక ప్రశాంతతను పెంచుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.