Atla Tadde 2024: అట్ల తద్దె 2024 తేదీ, శుభ సమయాలు ఇవిగో, వివాహిత స్త్రీలు జరుపుకునే సాంప్రదాయ పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి
అట్ల తద్ది అనేది తెలుగు ప్రజల సాంప్రదాయ పండుగ.ఆశ్వయుజ మాసం బహుళ తదియ రోజున అట్ల తద్ది (Atla Tadde 2021) అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ రోజు ఆడపడుచులు అందరు ఓ చోటకు చేరి చెట్లకు ఊయల కట్టి ఊగుతారు. "అట్ల తద్ది ఆరట్లు..ముద్దపప్పు మూడట్లు" అంటూ పాటలు పాడుతూ ఆడపడుచులకు, బంధువులకు, ఇరుగుపొరుగు వారికి వాయినాలిస్తారు.
అట్ల తద్ది అనేది తెలుగు ప్రజల సాంప్రదాయ పండుగ.ఆశ్వయుజ మాసం బహుళ తదియ రోజున అట్ల తద్ది (Atla Tadde 2021) అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ రోజు ఆడపడుచులు అందరు ఓ చోటకు చేరి చెట్లకు ఊయల కట్టి ఊగుతారు. "అట్ల తద్ది ఆరట్లు..ముద్దపప్పు మూడట్లు" అంటూ పాటలు పాడుతూ ఆడపడుచులకు, బంధువులకు, ఇరుగుపొరుగు వారికి వాయినాలిస్తారు. ఎంతో సందడిగా జరిగే ఈ పండగను (Atla Tadde) మహిళలు చాలా ఆనందంగా జరుపుకుంటారు.
అట్ల తద్దె 2024 అక్టోబర్ 20, 2024 ఆదివారం నాడు వస్తుంది. దృక్‌పంచాంగ్ ప్రకారం , అట్ల తద్దె రోజున చంద్రోదయ సమయం రాత్రి 08:37 గంటలకు. తదియ తిథి అక్టోబర్ 19 ఉదయం 09:48 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 20వ తేదీ ఉదయం 06:46 గంటలకు ముగుస్తుంది.
అట్ల తద్దె 2024 అక్టోబర్ 20 ఆదివారం వస్తుంది.
అట్ల తద్దె నాడు చంద్రోదయ సమయం రాత్రి 08:37 ని.
తదియ తిథి అక్టోబర్ 19 ఉదయం 09:48 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 20వ తేదీ ఉదయం 06:46 గంటలకు ముగుస్తుంది.
మరి ఈ రోజు విశేషాలేంటి? ఎలాంటి పూజలు చేస్తారు లాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వివాహిత హిందూ మహిళలు తమ భర్తల ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కోసం జరుపుకుంటారు. ఇది తెలుగు క్యాలెండర్ యొక్క అస్వియుజా నెలలో పౌర్ణమి తరువాత 3 వ రాత్రి సంభవిస్తుంది. గ్రెగోరియన్ క్యాలెండర్లో సెప్టెంబర్ లేదా అక్టోబర్లో వస్తుంది. పెళ్లీడుకొచ్చిన ప్రతి ఆడపిల్ల తనకు కాబోయే భర్త గురించి, వైవాహిక జీవితం గురించి కలలు కనడం సహజం. ఆ కలలు నెరవేరాలని ఎన్నో వ్రతాలు, నోములు చేస్తుంటారు. ఇందులో ఏటా జరుపుకునే అట్లతద్ది నోము ముఖ్యమైంది.ఆశ్వయుజ మాసంలో విజయదశమి తర్వాత వచ్చే తదియనాడు ఈ పండుగ జరుపుకుంటారు. ఐదేళ్ల దాటిన బాలికల నుంచి పండు ముత్తైదువుల వరకు ఈ అట్లతద్ది (Atla Taddi Celebrations) చేసుకుంటారు.
అవివాహిత యువతలు మంచి భర్త రావాలని పూజిస్తే, వివాహితులు మంచి భర్త దొరికినందుకు, అతడు ఆరోగ్యంగా ఉండాలని ఈ రోజు కోరుకుంటారు. సాధారణంగా వివాహమైన తర్వాత పదేళ్లపాటు తప్పనిసరిగా ఈ పూజను చేసి, సమాప్తం అయిందనడానికి గుర్తుగా ఉద్యాపన చేస్తారు. అంటే చివరిసారి పూజచేసి ముత్తైదవులను పిలిచి వాయినాలిచ్చి కన్నుల పండువగా ముగిస్తారు.
త్రిలోక సంచారి నారదుడి ప్రోద్బలంతో శివుని తన పతిగా పొందడానికి పార్వతిదేవి తొలుత చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకొనే వ్రతం. గౌరీదేవి శివుని భర్తగా పొందాలనే కృత నిశ్చయంతో ఉందని త్రిలోక సంచారి అయిన నారదుడు తెలుసుకున్నాడు. ఆమె కోరిక ఫలించాలంటే అట్లతద్ది వ్రతం చేయమని నారదుడు సూచించాడు. ఆయన ప్రోద్బలంతో పార్వతీదేవి చేసిన వ్రతమే అట్లతద్ది. ఇది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం. కన్నెపిల్లలు పడచువాణ్ణి పతిగా పొందాలనుకుంటే తప్పక ఆచరించవలసిన వ్రతమిది.
ఈ రోజు ఏ పనులు చేయాలి..
అట్ల తద్ది రోజున తెల్లవారుజామునే మేల్కొని తలంటి స్నానమాచరించాలి.ఉపవాసం ఉండి ఇంట్లో తూర్పు దిక్కున మండాపాన్ని ఏర్పాటు చేసి గౌరీదేవిని పూజించాలి. ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి, వినాయక పూజ తర్వాత గౌరీ స్తోత్రం, శ్లోకాలు పఠించాలి. సాయంత్రం చంద్రదర్శనం అనంతరం తిరిగి గౌరీపూజచేసి 10 అట్లు నైవేద్యంగాపెట్టాలి. అనంతరం ముత్తైదువులకు అలంకరించి పది అట్లు, పది పండ్లు వాయినంగా సమర్పిస్తారు. అట్లతద్ది నోము కథ చెప్పుకొని, అక్షతలు వేసుకోవాలి. ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్లు, రవిక గుడ్డలు, దక్షిణ తాంబూలాలు ఇచ్చి భోజనాలుపెట్టి తామూ భోజనం చేయాలి.
అట్లతద్ది ముందురోజు కాళ్ళు, చేతులకు అందంగా గోరింటాకు పెట్టుకుంటారు. గుమ్మాలకు తోరణాలు కడతారు.అట్లతద్ది రోజు ఆడవాళ్ళు తెల్లవారుజామున స్నానం చేసి, అన్నం తిని రోజంతా ఉపవాసం ఉంటారు.ఇంటిలో తూర్పుదిక్కున మంటపము ఏర్పాటుచేసిన గౌరీదేవి పూజ చేయాలి. ధూప, దీప, నైవేద్యాలు పెట్టి, వినాయక పూజ తర్వాత, గౌరీ స్తోత్రము, స్లోకాలు, పాటలు చదవడము, పాడడం చేస్తారు. సాయంత్రం చంద్ర దర్శనం అనంతరము తిరిగి గౌరీపూజ చేసి, 11 అట్లు నైవేద్యముగాపెట్టి, ముత్తైదువులకు అలంకారము చేసి, 11 అట్లు, 11 ఫలాలు వాయనముగా సమర్పించి, అట్లతద్దినోము కథ చెప్పుకొని, అక్షతలు వేసుకోవాలి.
ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్ళు, రవిక గుడ్డలు, దక్షిణతాంబూలాలు ఇచ్చి భోజనాలుపెట్టి, తామూ భోజనము చేయాలి. 11 రకాల ఫలాలను తినడం, 11 మార్లు తాంబూలం వేసుకోవడం, 11 మార్లు ఊయల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం, ఈపండుగలో విశేషము. దీనినే 'ఉయ్యాలపండగ' అనీ, 'గోరింటాకుపండగ' అనీ అంటారు.ఈ పండుగ రోజు ఆడవాళ్ళు తమ భర్తలు ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అట్లతద్ది జరుపుకుంటారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)