Citizenship Amendment Act Protests: దేశవ్యాప్తంగా 'పౌరసత్వ' నిరసనలు, దేశ రాజధాని సహా చాలా చోట్ల 144 సెక్షన్ విధించిన అధికారులు, దిల్లీలో 14 మెట్రో స్టేషన్లు మూసివేత

దేశవ్యాప్తంగా పలు నగరాలలో ఈరోజంతా ప్రణాళికాబద్ధమైన నిరసనల కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో పొలీసులు ధర్నాలు జరిగే అవకాశం ఉన్నచోట్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు....

Police bandobast near Red Fort (Photo Credits: ANI)

New Delhi, December 19:  పౌరసత్వ సవరణ చట్టాన్ని (Citizenship Amendment Act, 2019)  వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలు నగరాలలో ఈరోజంతా ప్రణాళికాబద్ధమైన నిరసన కార్యక్రమాలు (planned protests) ఉన్న నేపథ్యంలో పొలీసులు ధర్నాలు జరిగే అవకాశం ఉన్నచోట్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో దిల్లీలోని ఎర్రకోట (Delhi- Red Fort) సమీపంలో అధికారులు 144 సెక్షన్ (Section 144) ను విధించారు. అలాగే చాలా చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలులో ఉన్నాయి. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో సభలు, సమావేశాలు జరగకుండా నివారించేందుకు ఇటువైపుగా 14 మెట్రో స్టేషన్లు కూడా మూసివేశారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు నిరసనకారులు ఎర్ర కోట నుండి షాహీద్ భగత్ సింగ్ పార్క్ (ఐటిఓ) వరకు 'హమ్ భారత్ కే లోగ్' పేరుతో లాంగ్ మార్చ్ నిర్వహించతలపెట్టారు. అలాగే, ప్రతిపాదిత జాతీయ పౌర పట్టిక (NRC) ని వ్యతిరేకిస్తూ మండి హౌస్ నుండి జంతర్ మంతర్ వరకు మరో మార్చ్‌ను కమ్యూనిస్ట్ పార్టీ ప్లాన్ చేసింది. ఈ రెండింటికి పోలీసులు అనుమతిని ఇవ్వలేదు, ఈ క్రమంలో ప్రజలు ఇటువైపు రాకుండా అడ్డుకునేందుకు రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు, మెట్రో సర్వీసుల నిలిపివేత వంటి చర్యలు తీసుకుంటున్నారు. పటేల్ చౌక్, లోక్ కళ్యాణ్ మార్గ్, ఉద్యోగ్ భవన్, ఐటిఓ, ప్రగతి మైదాన్, ఖాన్ మార్కెట్, లాల్ ఖిల్లా, జామా మసీదు, చాందిని చౌక్, విశ్వవిదాలయ, జామియా మిలియా ఇస్లామియా, జసోలా విహార్, షాహీన్ బాగ్ మరియు మునిర్కా స్టేషన్లలో ఎంట్రీ మరియు ఎగ్జిట్ గేట్లను దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మూసివేసింది.  స్వార్థపరుల ఆటలు ఇక సాగవు, సీఏఏతో భారతీయులకు ఎలాంటి నష్టం జరగదు - మోదీ

ఇక ఇటు కర్ణాటకలోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. కొత్తగా ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం 2019 మరియు ప్రతిపాదిత దేశవ్యాప్త జాతీయ పౌరుల పట్టిక (ఎన్‌ఆర్‌సి) కు వ్యతిరేకంగా రాష్ట్రంలో వివిధ వామపక్ష, దళిత, ముస్లిం సంస్థలు నేడు కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు, రాష్ట్ర రాజధాని బెంగళూరుతో సహా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి) లోని సెక్షన్ 144 ను విధించారు.

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నిరసనల పేరుతో ఆస్తుల విధ్వంసానికి పాల్పడేవారిని అక్కడే కాల్చేయండి

దిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, భోపాల్, లక్నో, నాగ్‌పూర్, పుణె, చెన్నై, అహ్మదాబాద్ మరియు భువనేశ్వర్ తదితర నగరాలలో

CAAని రద్దు చేయాలంటూ పలు రాజకీయ, ప్రజా మరియు విద్యార్థి సంఘాల అధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ముందస్తు ప్రణాళికను నిరసనకారులు సిద్ధం చేసుకున్నారు.

పొరుగున ఉన్న ముస్లిం-మెజారిటీ దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ లలో మతపరమైన హింసకు గురికాబడిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు మరియు క్రైస్తవులు ఆ దేశాల నుంచి మనదేశానికి శరణార్థులుగా వచ్చిన వారికి పౌర సవరణ చట్టం భారత పౌరసత్వాన్ని మంజూరు చేస్తుంది. ఇందులో ముస్లిం వర్గాలను వదిలిపెట్టినందున కొత్తగా ఆమోదించిన చట్టం విమర్శించబడింది.

స్థానికంగా తమ హక్కులు దెబ్బతింటాయేమోనన్న భయం, ఇక్కడ జనాభాను తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయోమో అనే భయాలతో ఈశాన్య రాష్ట్రాలు ఈ CAA ను వ్యతిరేకిస్తున్నాయి.