Ayodhya Verdict: అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీద్ కేసులో ముగిసిన వాదనలు, తీర్పును రిజర్వ్‌లో ఉంచిన సుప్రీం కోర్ట్, ఈ కేసుకు సంబంధించి మీడియా ప్రసారాల పట్ల NBSA ఆంక్షలు

తీర్పు ఎవరివైపు ఉన్నా సరే ఈ కేసుకు సంబంధించి కోర్టు ప్రోసీడింగ్స్ కానీ, నిజనిర్ధారణపై న్యూస్ డిబేట్లు, మసీదు కూల్చివేత దృశ్యాలు, ఒకవర్గానికి సంబంధించిన సంబరాలు కానీ, అభిప్రాయాల ప్రసారం మొదలుగునవి ఎట్టి పరిస్థితుల్లో చూపించరాదని స్పష్టమైన ఆదేశాలు...

Supreme Court of India. File Image. (Photo Credits: ANI)

New Delhi, October 16:  సుదీర్ఘ కాలంగా 134 ఏళ్ల తరబడి కొనసాగుతున్న అయోధ్య రామజన్మభూమి, బాబ్రీమసీదు వివాదానికి సంబంధించిన కేసులో వాదనలు ముగిశాయి. అక్టోబర్ 16 సాయంత్రం 5 గంటల వరకే ఇరుపక్షాల వాదనలు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు అంతకుముందే స్పష్టం చేసిన నేపథ్యంలో ఇరుపక్షాలు తమ వాదనలు వినిపించడం పూర్తి చేశారు. ఇక దీనిపై వెలువరించాల్సిన తుది తీర్పును సుప్రీం తీర్పును రిజర్వ్ లో పెట్టింది. ఈ కేసుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న లేదా ఇంకా విచారించకుండా మిగిలిపోయిన అంశాలేమైనా ఉంటే కోర్టుకు సమర్పించాల్సిందిగా పిటిషనర్లకు మూడు రోజులు గడువు విధించింది.

ఈ కేసులో తుది తీర్పును నవంబర్ 17న సుప్రీంకోర్టు ప్రకటించనుంది. అదేరోజు ఈ కేసుపై తుది తీర్పు వెలువరించే చీఫ్ జస్టిస్ జస్టిస్ రంజన్ గోగోయ్ పదవీ విరమణ చేయబోతున్నారు. దీంతో  ఈ తీర్పు ఎలా ఉండబోతుందనే దానిపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది.

రాజకీయ పరంగా, మతపరంగా, చారిత్రాత్మక అంశాల పరంగా అతి సున్నితమైన ఈ కేసును సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఆగస్టు 6 నుంచి కేసును విచారిస్తున్న విషయం తెలిసిందే.  గత 40 రోజులుగా రాజ్యంగ ధర్మాసనం ఎదుట కొనసాగుతున్న వాడీవేడీ వాదనలకు నేటితో తెరపడింది.

మరోవైపు ఈ కేసు విషయంలో ప్రసార మాధ్యమాలలో వచ్చే వార్తలకు సంబంధించి కూడా ఆంక్షలు విధించారు. మీడియా సిబ్బందికి నిర్దిష్ట మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి. తీర్పు ఎవరివైపు ఉన్నా సరే,  ఏ మతానికి సంబంధించిన వర్గాలకైనా భయాందోళనలు కలిగించేలా  ఈ కేసుకు సంబంధించి కోర్టు ప్రోసీడింగ్స్ కానీ, నిజనిర్ధారణపై న్యూస్ డిబేట్లు, మసీదు కూల్చివేత దృశ్యాలు, ఒకవర్గానికి సంబంధించిన సంబరాలు కానీ, అభిప్రాయాల ప్రసారం మొదలుగునవి ఎట్టి పరిస్థితుల్లో చూపించరాదని స్పష్టమైన ఆదేశాలు జారీచేయబడ్డాయి.

Advisory Issued by NBSA:

రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థలం విషయంలో హిందూ వర్గాలు, ముస్లిం వర్గాల మధ్య శతాబ్ద కాలానికి పైగా వివాదం నడుస్తోంది. ఆ స్థలం మాది అని హిందూ వర్గాలు వాదిస్తున్నారు. 16వ శతాబ్దంలో ఓ ముస్లిం దాన్ని ఆక్రమించాడని హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదుని నిర్మించాడని చెబుతున్నారు. అయితే ముస్లీంలు మాత్రం ఆ స్థలం మాదేనని 1949 వరకూ మేము అక్కడ ప్రార్థనలు చేశామని అదే ఏడాది కొంత మంది రాత్రి వేళ చీకట్లో రాముడి విగ్రహాలను తెచ్చి ఆ మసీదులో పెట్టారని చెబుతున్నారు. ఆ తర్వాతే హిందువులు పూజించటం ప్రారంభించారని చెబుతున్నారు. ఇలా నాలుగు దశాబ్దాల పాటు అక్కడ వివాదం నడుస్తూనే ఉంది. కోర్టు చుట్టూ ఈ కేసు తిరుగుతూనే ఉంది.

అయితే, 1992లో హిందువుల గ్రూపు మసీదును ధ్వంసం చేయటంతో ఈ వివాదం ఉద్ధృతమైంది. 1992 డిసెంబర్ ఆరో తేదీన విశ్వహిందూ పరిషత్ (VHP)కి చెందిన హిందూ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ), అనుబంధ సంస్థలకు చెందిన కొందరు నాయకులు అయోధ్యలోని ఈ వివాదాస్పద స్థలం దగ్గర ప్రధర్శణలు నిర్వహించారు, ఆ ప్రదర్శన హింసాత్మకంగా మారిన నేపథ్యంలో తర్వాత జరిగిన మత అల్లర్లలో దేశవ్యాప్తంగా దాదాపు 2,000 మంది చనిపోయారు. దీంతో పాటుగా కొంతమంది హిందూ కార్యకర్తలు కూడా చనిపోయారు. దీంతో వివాదం మరింతగా ముదిరిపోయింది.  2010లో అలహాబాద్ హైకోర్టు  దీనిపై తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో త్రిసభ్య ధర్మాసనంలోని ఇద్దరు హిందూ న్యాయమూర్తులు భారతదేశంలో మొఘలు సామ్రాజ్య వ్యవస్థాపకుడైన బాబర్ నిర్మించిన ఆ భవనం నిజానికి మసీదు కాదని పేర్కొన్నారు. కూల్చివేసిన హిందూ దేవాలయ స్థలంలో ఇస్లాం సూత్రాలకు వ్యతిరేకంగా దానిని నిర్మించారని వ్యాఖ్యానించారు. అయితే ఈ ధర్మాసనంలో ఉన్న ముస్లిం న్యాయమూర్తి ఈ అభిప్రాయంతో విభేదించారు. అక్కడ ఏ ఆలయాన్నీ ధ్వంసం చేయలేదని ఆ మసీదును శిథిలాల మీద నిర్మించారని ఆయన వాదించారు.

దీంతో సంవత్సరాలు గడుస్తున్నా ఈ వివాదం అలాగే ఉండిపోయింది.

అక్టోబర్ 16, 2019తో ఈ కేసుకు సంబంధించి వాదనలు పూర్తి అయినట్లు సుప్రీంకోర్ట్ ప్రకటించింది. నవంబర్ 14, 2019న ఈ కేసు విషయంలో సుప్రీంకోర్ట్ వెలువరించే తీర్పు చారిత్రాత్మకం కాబోతుంది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Viveka Murder Case: జగన్‌ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెప్పా, వాచ్‌మెన్ రంగన్న మృతిపై అనుమానాలున్నాయంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Advertisement
Advertisement
Share Now
Advertisement