కేరళ రాష్ట్రం కొచ్చిలోని ప్రమదం స్టేడియంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హెలికాప్టర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. శుక్రవారం ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అయిన హెలిప్యాడ్‌లో అనుకోని సమస్యల కారణంగా కొంచెం కుంగి, ఒక పక్కకు ఒరిగింది. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, హెలికాప్టర్ సిబ్బంది తక్షణ చర్యలు తీసుకున్నారు.

తెనాలిలో పట్టపగలే నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య, స్కూటీపై మాస్క్‌ వేసుకొని కొబ్బరికాయల కత్తితో నరికి చంపిన దుండగుడు, షాకింగ్ వీడియో ఇదిగో..

ప్రారంభ నివేదికల ప్రకారం.. హెలికాప్టర్ తక్కువ వేగంతో మాత్రమే కుంగింది. ఎలాంటి ప్రాణాంతక పరిస్థితి ఏర్పడలేదు. ద్రౌపది ముర్ము సురక్షితంగా స్టేడియంలో దిగారు. అధికారులు హెలికాప్టర్ సాంకేతిక సమస్యలపై వివరాలను సేకరిస్తున్నారని తెలిపారు. సంబంధిత అధికారులు, సిబ్బంది భద్రతా చర్యలన్నింటినీ కఠినంగా పాటించారు. ఈ ఘటన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పబ్లిక్ కార్యక్రమానికి చేరుకునే మార్గంలో జరిగింది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, హెలికాప్టర్ మెకానికల్ సమస్యల కారణంగా కుంగి ఒరిగినట్లు గుర్తించారు. ప్రస్తుతానికి హెలికాప్టర్ మరమ్మతులు చేయబడుతున్నాయని అధికారులు తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)