కేరళలోని శబరిమలలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా మకరజ్యోతి దర్శనమిచ్చింది. పొన్నాంబలమేడు కొండల్లోని కందమల శిఖరంపై మకరజ్యోతి కనిపించింది. దీంతో అయ్యప్ప నామస్మరణతో శబరిమల గిరులు మారుమోగాయి. మకరజ్యోతి దర్శనంతో అయ్యప్ప భక్తులు పరవశించిపోయారు. మూడుసార్లు దివ్య కాంతి దర్శనమిచ్చింది. జ్యోతి దర్శనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.పందళం ప్యాలెస్ నుంచి తీసుకువచ్చిన పవిత్రమైన ఆభరణాలతో అయ్యప్ప విగ్రహాన్ని అలంకరించే పవిత్రమైన ఆచారం అయిన దీపారాధన పూర్తైన తర్వాత మకర జ్యోతి దర్శనం ఇచ్చింది.

మకర విళక్కు(మకర జ్యోతి) దర్శనం అన్ని ఏర్పాట్లు పూర్తి, భక్తుల రద్దీ దృష్ట్యా పకడ్బందీ ఏర్పాట్లు చేసిన కేరళ పోలీసులు

Makarajyothi Darshan Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)