Sunni Waqf Board On Supreme Court Judgment: తీర్పు నిరాశపరిచింది, అయినా తీర్పును గౌరవిస్తున్నాం, తీర్పు కాపీని మరింతగా పరిశీలించిన తరువాతనే భవిష్యత్ కార్యాచరణ, క్లయిమ్‌ని తిరస్కరించిన సున్నీ వక్ఫ్ బోర్డు
సుప్రీం తీర్పు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీం తీర్పును గౌరవిస్తాం. కానీ తాము ఆ తీర్పుతో సంతృప్తి చెందలేదు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
New Delhi, November 9: యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూసిన సున్నితమైన అంశం అయోధ్యలో రామజన్మభూమి - బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పును గౌరవిస్తున్నామని సున్నీ వక్ఫ్ బోర్డు లాయర్ జిలానీ పేర్కొన్నారు. సుప్రీం తీర్పు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీం తీర్పును గౌరవిస్తాం. కానీ తాము ఆ తీర్పుతో సంతృప్తి చెందలేదు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
తీర్పు కాపీని మరింత పరిశీలించాల్సి ఉందని.. ఆ తర్వాతే భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామన్నారు. అందరూ శాంతియుతంగా ఉండాలని.. ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో తమకు ఐదెకరాలు అవసరం లేదని స్పష్టం చేసింది.
రివ్యూకి వెళతామన్న సున్నీ వక్ఫ్ బోర్డ్
అయోధ్యలో వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణానికి కేటాయించాలని, మూడు నెలల్లో అయోధ్య ట్రస్టును ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. రాముడు అయోధ్యలో జన్మించాడన్నది నిర్వివాదాంశమని, ముస్లింలు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారని చీఫ్ జిస్టిస్ రంజన్ గొగోయ్ అభిప్రాయపడ్డారు. ప్రధాన గుమ్మటం కింద గర్భాలయం ఉందని హిందువులు విశ్వసిస్తున్నారని, గతంలో రెండు మతాల వారు వివాదాస్పద స్థలంలో ప్రార్థనలు చేసేవారన్నారు.
మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉందని, వివాదాస్పద స్థలంలో మసీదు లేదని, అక్కడ హిందు నిర్మాణం ఉండేదని పురావస్తు విభాగం చెబుతోందని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ స్థలంపై మొఘలుల సమయం నుంచే హక్కు ఉన్నట్లు వక్ఫ్ బోర్డ్ నిరూపించలేకపోయిందని, శుక్రవారం ముస్లింలు ప్రార్థనలు చేసినట్లు మాత్రమే ఆధారాలు సమర్పించిందని పేర్కొంది.
తీర్పు నిరాశ పరిచిందన్న Sunni Waqf Board Lawyer
ఈ నేపథ్యంలో అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని పంచుకోవాలంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తప్పు పట్టింది. వివాదాస్పద స్థలాన్ని పంచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. మసీదు నిర్మాణం కోసం 5ఎకరాల స్థలాన్ని అయోధ్య ట్రస్టు్ కేటాయించాలని ఆదేశించింది.
అయోధ్య తుదితీర్పును వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు వెలువరించింది. '2.77 ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్ట్‌కు అప్పగించండి. ప్రత్యామ్నాయంగా ఐదెకరాల భూమిని సున్నీ బోర్డుకు ఇవ్వండి. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. అయోధ్య చట్టం కింద మూడు నెలల్లో మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేయండి. ఆ భూమిని ట్రస్ట్‌కి అప్పగించండి. ఆలయ నిర్మాణం, నిర్వహణ పనులను ట్రస్ట్ చేపట్టాలని' తీర్పులో వెల్లడించింది.