Ayodhya Land Dispute Case: అయోధ్యలో పలు ఆంక్షలు, తీర్పుపై ఎలాంటి పోస్టులు చేయవద్దు, డిసెంబర్‌ 28 వరకు అమల్లోకి ఆంక్షలు, అన్ని ఫోన్ కాల్స్ రికార్డు, హెచ్చరికలు జారీ చేసిన యూపీ రాష్ట్ర డీజీ ఓ.పీ.సింగ్

వివాదాస్పద అయోధ్య కేసు విషయానికి సంబంధించి సోషల్ మీడియా(Social Media)లో రెచ్చగొట్టే పోస్టులను పెట్టి శాంతి భద్రతల సమస్యలకు కారణమయ్యేవారిపై జాతీయ భద్రతా చట్టం ప్రకారం కేసులను నమ్మోదు(Ayodhya)చేస్తామని ఉత్తరప్రదేశ్ యూపీ రాష్ట్ర డీజీ ఓ.పీ.సింగ్ హెచ్చరించారు.

Ayodhya land dispute case ahead-of-ayodhya-verdict-authorities-ban-mourning-victory-processions-extend-restrictions (Photo-PTI)

New Delhi, November 5: వివాదాస్పద అయోధ్య కేసు విషయానికి సంబంధించి సోషల్ మీడియా(Social Media)లో రెచ్చగొట్టే పోస్టులను పెట్టి శాంతి భద్రతల సమస్యలకు కారణమయ్యేవారిపై జాతీయ భద్రతా చట్టం ప్రకారం కేసులను నమోదు(Ayodhya)చేస్తామని ఉత్తరప్రదేశ్ యూపీ రాష్ట్ర డీజీ ఓ.పీ.సింగ్ హెచ్చరించారు. రామమందిరం–బాబ్రీ మసీదు(Ram Janmabhoomi-Babri Masjid)పై నవంబర్‌ 17లోగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం అయోధ్యలో పలు ఆంక్షలు విధించింది.

సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం జరగకుండా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ విషయంలో ఎలక్ట్రానిక్‌ మీడియాలోనూ చర్చలు జరపకుండా ఆంక్షలు విధించనున్నారు. డిసెంబర్‌ 28 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ కాలంలో అన్ని ఫోన్‌ కాల్స్‌ రికార్డు చేస్తామని తెలిపింది.

ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్‌ (Facebook, Whatsapp, Twitter) లాంటి సామాజిక మాధ్యమాలలో అసత్యాల ప్రచారం (Propaganda of lies) జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్‌ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, తీర్పు వెలువడిన రోజు దేవతా విగ్రహాల ప్రతిష్టాపన, విజయోత్సవ ఊరేగింపులు జరపకుండా నిషేధం విధించారు. రాళ్లు సేకరించడం, కిరోసిన్, యాసిడ్‌ అమ్మకాలు కూడా నిలిపివేశారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వ అధికారుల, పోలీసుల సెలవులను యూపీ ప్రభుత్వం రద్దుచేసింది.

ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్ద అత్యంత కీలకమైన మూడు కేసుల ఉన్నాయి. అయోధ్య భూవివాదం(Ayodhya land dispute)తో పాటు వేల కోట్ల రూపాయల మేర ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలను ఎదుర్కొన్న రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం(Rafale Deal), శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసులు(Sabarimala Temple Case/Verdict)..ఈ మూడు కేసులపై రంజన్‌ గొగోయ్ ధర్మాసనం(Ranjan Gogoi) తీర్పును వెలువరించాల్సి ఉంది.

పని దినాలు ఎనిమిది రోజులు కావడంతో ఈ వారాంతం నుంచి ఒక్కో కేసు తీర్పును వెలువరిస్తూ వస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 17వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్ పదవీ విరమణ (Ranjan Gogoi Retirement Time) చేయబోతున్న నేపథ్యంలో దశాబ్దాల నుండి న్యాయస్థానాల్లో నలుగుతూ వస్తున్న చారిత్రాత్మక అయోధ్య భూవివాదంపై తీర్పును వెలువరించే అవకాశం ఉంది.

17 తేదీ లోగా సుప్రీంకోర్టు పనిదినాలు కూడా ఎక్కువగా లేవు. ఈ నేపథ్యంలోనే అత్యంత సున్నితం, సమస్యాత్మకమైనదిగా భావిస్తున్న రామజన్మభూమి – బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించిన తీర్పు వెలువడిన అనంతరం నెలకొనే పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif