Ayushman Bharat Yojana: మోదీ ప్రభుత్వం అందిస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్డుతో, రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం చేయించుకునే అవకాశం, ఎలా అప్లై చేయాలంటే..
ఈ పథకం కింద అర్హులైన వారికి ఉచితంగానే రూ.5 లక్షల వరకు ప్రయోజనం లభిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నా పలు పథకాల్లో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ (Ayushman Bharat Yojana) ఒకటి. ఈ పథకం కింద అర్హులైన వారికి ఉచితంగానే రూ.5 లక్షల వరకు ప్రయోజనం లభిస్తోంది. ఆయుష్మాన్ భారత్ అనేది హెల్త్ స్కీమ్. 2018 ఏప్రిల్ 1 నుంచి ఈ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. 2018 బడ్జెట్‌లోనే ఈ పథకం గురించి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం బలహీన వర్గాలకు అంటే ఆర్థికంగా వెనుకబడిన వారికి పేదలకు ఉచిత వైద్యం అందుబాటులో ఉంచడం. అయితే ఇక్కడ పథకం అమలులోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా కూడా లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేదు. 53 కోట్ల మందికి ఈ స్కీమ్ కింద ప్రయోజనం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
ఇకపోతే ఆయుష్మాన్ భారత్ కార్డు కలిగిన వారికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం లభిస్తుంది. ప్రభుత్వ లేదా ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చికిత్స చేయించుకోవచ్చు. కరోనా సమయంలో చాలా మంది ఆయుష్మాన్ కార్డుల ద్వారా వైద్యం చేయించుకున్నారు. మీరు కూడా ఈ కార్డు పొందాలని భావిస్తే.. దగ్గరిలోని గవర్నమెంట్ హాస్పిటల్‌కు వెళ్లి సంప్రదించండి. లేదంటే కామన్ సర్వీస్ సెంటర్లలో కూడా మీరు ఈ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు.