Bhopal, Feb 11: మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలోని పౌడి గ్రామంలో దారుణ ఘటన (Madhya Pradesh Shocker) చోటు చేసుకుంది.కులాంతర వివాహం చేసుకున్న దంపతులు తమను తిరిగి గ్రామంలోకి అనుమతించడానికి బదులుగా గ్రామ పెద్దలు , పంచాయితీ సభ్యులు తమ నుండి రూ. 2 లక్షలు డిమాండ్ (villagers demand Rs 2 lakh to allow return) చేశారని ఆరోపించారు. దారుణ ఘటన వివరాల్లోకెళితే.. పౌడీ గ్రామంలోని ఓబీసీ వర్గానికి చెందిన రాజేష్ ప్రజాపతి, ఎస్సీ వర్గానికి చెందిన జ్యోతి ఉతయను ఆరేండ్ల కిందట కులాంతర వివాహం చేసుకున్నాడు. కులాంతర వివాహం చేసుకున్న ఆ జంటను పౌడి గ్రామం నుంచి (Couple ostracized for inter-caste marriage) బహిష్కరించారు.
ఈ నేపథ్యంలో రాజేష్ దంపతులు ఆ గ్రామాన్ని, తమ కుటుంబాలను వీడిపోయింది. కాగా, తమ తప్పును క్షమించాలంటూ రాజేష్ కుటుంబం కొంత కాలంగా గ్రామ పెద్దలను వేడుకుంటున్నది. గ్రామానికి తిరిగి వచ్చేందుకు వారిని ప్రాధేయపడుతున్నది. గ్రామ పెద్దలు చేసిన కొన్ని డిమాండ్లకు కూడా వారు ఒప్పుకున్నారు. గ్రామస్తులకు విందు ఇవ్వడంతోపాటు భాగవత కచేరీని నిర్వహించారు. దీని కోసం రాజేష్ కుటుంబం చాలా ఖర్చు చేసింది.
అయితే గ్రామ పెద్దలు తాజాగా కొత్త డిమాండ్లు చేశారు. గ్రామ బహిష్కరణను ఎత్తివేసేందుకు రెండు లక్షలు ఇవ్వాలని అడిగారు. దీంతో విసిగిపోయిన రాజేష్, తన భార్యతో కలిసి పోలీసులను ఆశ్రయించాడు. బహిష్కరణ విధించిన గ్రామ పెద్దలపై ఫిర్యాదు చేశాడు. ఆరేండ్లుగా అనేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు కులాంతర వివాహం చేసుకున్న జంటకు గ్రామ బహిష్కరణ విధించిన ఘటనపై ఫిర్యాదు అందిందని దామోహ్ డీఎస్పీ తనిబార్ తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అలాంటి డిమాండ్లు చేసే గ్రామ పెద్దలపై, అలాగే సభ్యులుఅక్రమార్జనకు పాల్పడినట్లు గుర్తిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
బాధితులు ఏమన్నాడంటే..
"మేము ఇప్పటికే ఆరు సంవత్సరాలుగా బాధపడ్డాము. అందుకే గ్రామ పంచాయితీ కోరడంతో నాన్న తపస్సుకు అంగీకరించాడు. మేము కమ్యూనిటీకి తిరిగి రావాలని కోరుకున్నాము కాబట్టి మేము 'భగవద్ కథ' గ్రామస్తులకు విందు ఏర్పాటు చేయడానికి అంగీకరించాము. దానికి సరిపడా డబ్బులు లేకపోవడంతో అప్పు తీసుకున్నాం. అయితే మమ్మల్ని అడిగినంత చేసినా.. కొందరు గ్రామస్థులు సీన్ క్రియేట్ చేసి అదనంగా రూ.2 లక్షలు ఇచ్చేంత వరకు తపస్సు పూర్తికాదని చెప్పారు’’ అని ప్రజాపతి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.