Badlapur Rape Accused Shot Dead: పోలీసుల కాల్పుల్లో బద్లాపూర్ అత్యాచార నిందితుడు మృతి, తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపై కాల్పులు జరిపిన నిందితుడు
పోలీసుల కథనం ప్రకారం.. తనపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ షిండేపై గతవారం ఆయన రెండో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Mumbai, Sep 24: బద్లాపూర్ అత్యాచార నిందితుడు అక్షయ్ షిండే (24) పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. తనపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ షిండేపై గతవారం ఆయన రెండో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో అతడిని ప్రశ్నించేందుకు నిన్న సాయంత్రం 5.30 గంటల సమయంలో తలోజా జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకున్నారు.
అక్కడి నుంచి పదిమంది పోలీసుల భద్రతతో బద్లాపూర్‌కు తీసుకెళ్తుండగా ముంబ్రా బైపాస్ వద్ద వ్యానులో ఉన్న పోలీసు నుంచి తుపాకి లాక్కుని కాల్పులు ప్రారంభించాడు. ఓ ఏఎస్సై కాలులోకి బులెట్లు దూసుకెళ్లాయి. దీంతో అప్రమత్తమైన మరో పోలీసు నిందితుడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నిందితుడితోపాటు పోలీసులు కూడా గాయపడ్డారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అక్షయ్ ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసు కాల్పుల్లో
మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో నర్సరీ చదువుకుంటున్న నాలుగేళ్లున్న ఇద్దరు చిన్నారులపై అదే స్కూల్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్నఅక్షయ్ షిండే అత్యాచారానికి పాల్పడ్డినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి విదితమే.